ఆంధ్రప్రదేశ్‌

ఏసీబీకి చిక్కిన వీఆర్‌ఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవనకొండ, డిసెంబర్ 4: ఈపాసు పుస్తకం ఇచ్చేందుకు ఓ రైతు నుంచి లంచం తీసుకున్న వీఆర్‌ఓను ఏసీబీ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పాలకుర్తికి చెందిన రైతు శివశంకర్‌రెడ్డి తన పొలానికి సంబంధించిన ఈపాసు పుస్తకం కోసం వీఆర్‌ఓ ఈశ్వర్‌రెడ్డిని సంప్రదించగా ఆయన తొలుత రూ.8 వేలు లంచం అడిగాడు. దీంతో రైతు ఆ సొమ్ము ఇచ్చాడు. కొన్ని రోజులు తిప్పించుకున్న తరువాత మరో రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సోమవారం వీఆర్‌ఓ ఈశ్వర్‌రెడ్డికి రూ.5 వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ విజయరామరాజు సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు.