ఆంధ్రప్రదేశ్‌

జగన్‌ది పాడుయాత్ర: కేఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, డిసెంబర్ 4: వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చేస్తున్నది పాదయాత్ర కాదని, అది పాడుయాత్ర అని ఉప ముఖ్యమంత్రి కెయి.కృష్ణమూర్తి అన్నారు. జగన్‌కు ప్రజలే బాయ్‌కాట్ చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో సోమవారం జరిగిన తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజల సమస్యలపై గళం విప్పుతారని ప్రజలు ఆయనను, పార్టీ ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే అసెంబ్లీని బాయ్‌కాట్ చేసి పాదయాత్ర పేరుతో యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే టీడీపీలోకి వెళ్తారనే భయంతోనే అసెంబ్లీకి రాకుండా చేశారన్నారు. జగన్‌పై ఉన్న 13 కేసుల్లో శిక్ష పడడం ఖాయమని అన్నారు.