ఆంధ్రప్రదేశ్‌

ఒకే కుటుంబంలో నలుగురి బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట/జె పంగులూరు, డిసెంబర్ 4: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం పాలైన విషాదం ఇది. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో సోమవారం రైలు కింద పడి ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన విజయలక్ష్మి (33)కి ప్రకాశం జిల్లా జె. పంగులూరు మండలం రాంకూరుకు చెందిన పెనుబోతు సోమశేఖర్ (34)తో వివాహం జరిగింది. ఈ దంపతులకు కూతురు దిగ్విజయ (10), కుమారుడు గణేష్‌సాయి (7) ఉన్నారు. గత కొంత కాలంగా కుటుంబంలో కలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో విజయలక్ష్మి సోమవారం ఇద్దరు పిల్లల్ని తీసుకుని గుంటూరు జిల్లా నరసరావుపేట వచ్చి, మూడో రైల్వే గేటు వద్ద వేగంగా వస్తున్న రైలు కిందకు పిల్లల్ని తోసేసి, తాను కూడా అదే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. అంతకు ముందే భర్త సోమశేఖర్‌కు ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపింది. ఈ వార్త విన్న సోమశేఖర్ తట్టుకోలేక చిలకలూరిపేటలో ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నారి దిగ్విజయ పుట్టినరోజు నాడే ఈ దారుణం జరగటంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. నరసరావుపేట రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు పిల్లలతో తల్లి(ఫైల్‌ఫొటో)