ఆంధ్రప్రదేశ్‌

లొంగిపోయిన నక్సల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, డిసెంబర్ 4: మావోయిస్టు దంపతులతో పాటు కొరియర్ తూర్పు గోదావరి జిల్లా పోలీసుల ఎదుట సోమవారం లొంగిపోయారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కార్యకలాపాలను నిర్వహించే మావోయిస్టు దళంలో పనిచేసిన సుకుమా జిల్లా గాసంపాడు గ్రామానికి చెందిన మడివి జోగయ్య అలియాస్ రోషన్(28), ఎటపాక మండలం జగ్గారం గ్రామానికి చెందిన కలుమా పొజ్జి అనే రాధ(24) ప్రేమించుకుని 2014వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అయితే మావో దళంలో కొనసాగుతున్న వివక్ష ఈ దంపతులను తీవ్రంగా కలచివేసింది. మావోయిస్టు కార్యకలాపాలపై పూర్తిగా విరక్తిచెంది దళం నుండి బయటపడి ప్రశాంతంగా జీవించాలని దంపతులు ఇద్దరూ భావించారు. సుకుమా జిల్లా గంగిలేరు గ్రామానికి చెందిన సున్నం నగేష్ (26) అనే కొరియర్‌తో కలసి సోమవారం తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిని ఎస్పీ అభినందించారు. ఎవరైనా మావోయిస్ట్ దళ సభ్యులు లొంగిపోవాలని భావిస్తే వారికి అవసరమైన రక్షణ కల్పించడమే కాకుండా, ప్రభుత్వం నుండి సహకారాన్ని అందజేస్తామని ఎస్పీ విశాల్ గున్ని సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. లొంగిపోయిన మావోయిస్టుల నేపథ్యం ఇలావుంది... మడివి జోగయ్య అనే రోషన్ 2011వ సంవత్సరం నుండి మావోయిస్టు దళ సభ్యునిగా కిష్టావరం ఎల్‌జిఎస్, గొల్లపల్లి ప్రాంతాల్లో పనిచేశాడు. 2012లో వింపా క్యాంపు ఎటాక్, పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో ముసకి జోగా అనే గిరిజనుడిని కిడ్నాప్‌చేసి హతమార్చిన ఘటనలో పాల్గొన్నాడు. 2012లో బెజ్జి అంబుష్ నందు, 2013లో జరిగిన దంబకుంట ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నాడు. అనంతరం చంద్రన్నకు సెక్యూరీటీ గార్డుగా పనిచేశాడు.