ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు పాలన అవినీతిమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాచిపెంట, డిసెంబర్ 5: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పాలన అవినీతిమయమని వైసీపీ విజయనగరం, విశాఖ జిల్లాల పరిశీలకుడు భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. విజయనగరం జిల్లా, పాచిపెంట మండలంలోని పాంచాలి గ్రామంలో మంగళవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం హత్యారాజకీయాలకు ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. రెండునెలల కిందట పత్తికొండ నియోజకవర్గంలో నారాయణరెడ్డిని అతికిరాతంగా చంపించారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక సంక్షేమ పథకాలను పెట్టి ప్రజలు గుండెల్లో చెరగని ముద్రగా నిలిచారన్నారు. రాష్ట్ర అభివృద్ధి జగన్మోహనరెడ్డితోనే సాధ్యమన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నవరత్నాల పథకాలను అమలు చేస్తారని, అమ్మ ఒడి, రైతు రుణమాఫీ, ఫీజురియంబర్స్‌మెంట్ వంటి బృహత్తర పథకాలను అమలు చేయనున్నారని తెలిపారు.