ఆంధ్రప్రదేశ్‌

మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, డిసెంబర్ 5: విశాఖపట్నం జిల్లాలో పరీక్షలు సక్రమంగా రాయలేదనే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. చోడవరం మండలంలోని గాంధీగ్రామ పంచాయతీ, లక్ష్మీనగర్‌కు చెందిన రిట్టా హరిత (19) ఇక్కడి ఒక ప్రైవేట్ కళాశాలలో బీఎస్‌సీ డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. మంగళవారం కెమిస్ట్రీ పరీక్ష రాసి ఇంటికి వచ్చిన హరిత కుటుంబ సభ్యులతో పరీక్ష సరిగ్గా రాయలేకపోయానని, అందరి ముందు చులకనగా ఉంటుందేమోనని చెప్పి బాధపడింది. తల్లి లక్ష్మీనర్సయ్యమ్మ, సోదరుడు బాలనారాయణలు సర్దిచెప్పారు. చదువుకుంటానని చెప్పి, సాయంత్రం ఐదుగంటలకు సమీపంలోని అక్క బాసర లీలావాణి ఇంటికి వెళ్ళింది. హరిత ఎంతసేపటికీ రాకపోవడంతో అక్క కుమార్తె దేదీప్యను పంపించారు. తలుపులు వేసి ఉండటంతో కిటికీలోనుండి లోనికి చూసింది. ఫ్యాన్‌కు ఉరిపోసుకున్న అక్కను చూసి, దేదీప్య గట్టిగా కేకలు వేస్తూ అమ్మమ్మకు చెప్పింది. హరిత సోదరుడు బాలనారాయణ మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు.