ఆంధ్రప్రదేశ్‌

మంత్రి లోకేష్‌తో విదేశీ యువత భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భారతావనిని తెలుసుకోండి అన్న కార్యక్రమం కింద 9 దేశాల నుంచి భారత మూలాలు కలిగిన ఉన్న 40 మంది యువతీ, యువకులు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి లోకేష్‌ను వెలగపూడి సచివాలయంలో మంగళవారం కలిశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని విజయవాడ, రాజమండ్రి, విశాఖల్లో వీరు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వారు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమధానాలు చెప్పారు. రాష్ట్ర విభజన, ఎదుర్కొంటున్న సమస్యలు, రియల్ టైమ్ గవర్నెన్సు, ఫైబర్ గ్రిడ్‌ల గురించి మంత్రి వివరించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు.