ఆంధ్రప్రదేశ్‌

గిరిజన మహిళల ఉపాధి కోసం ‘ఉజ్వల’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 5: గిరిజన మహిళలకు ఉపాధి కల్పించడం ద్వారా వారిని, సమాజ వ్యతిరేక శక్తుల ప్రలోభాలకు లోనుకాకుండా పోలీసులు సరికొత్త పంథాను అనుసరిస్తున్నారు. కేవలం ఉపాధి లేమి కారణంగానే గిరిజనులు ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారని భావించిన యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే టెన్త్ నుంచి డిగ్రీ చదువుకున్న గిరిజన మహిళలకు నర్సింగ్ కోర్సుల్లో శిక్షణ ఇప్పించి ఉద్యోగవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. తొలి విడతగా విశాఖ జిల్లా ఏజెన్సీ మండలాలైన మారుమూల గ్రామాల నుంచి 100 మంది యువతులను ఎంపిక చేశారు. వీరిలో తొలి దశలో 35 మంది యువతులను శ్రీకాకుళం జిల్లా రాజాంలోని జీఎంఆర్ రాజ్యలక్ష్మి ఫౌండేషన్ సహకారంతో ఉచి త నర్సింగ్ శిక్షణ ఇప్పిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న యువతులకు ఇంటర్నేషనల్ రెడ్‌క్రాస్ సొసైటీ తరపున హైదరాబాద్‌లో ఉద్యోగాలు కల్పిస్తారు. నెలకు రూ.10 వేల వేతనంతో ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పిస్తారు. శిక్షణ సందర్భంగా వీరికి జీఎంఆర్ రాజ్యలక్ష్మి ఫౌండేషన్ ఉచిత భోజన, వసతి సదుపాయం కల్పిస్తారు. ఎంపికైన వీరిని జిల్లా అదనపు ఎస్పీ(పరిపాలన) జి.శ్రీకాంత్ మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, అదనపు ఎస్పీ సిద్దార్థ కౌసల్ గిరిజన యువతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చిత్రం..శిక్షణకు ఎంపికైన మహిళలు