ఆంధ్రప్రదేశ్‌

బూసన్, ఏపీ భాయ్ భాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: నవ్యాంధ్రలో పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా ప్రారంభమైన ముఖ్యమంత్రి చంద్రబాబు కొరియా పర్యటన మంగళవారం రెండో రోజుకు చేరింది. దక్షిణ కొరియాలో ఉదయం ఏడున్నరకు (్భరత కాలమానం ప్రకా రం తెల్లవారుజామున నాలుగు గంటలకు) ముఖ్యమంత్రి కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. దక్షిణ కొరియా పారిశ్రామిక నగరం బూసన్ సందర్శనకు సియోల్ నుంచి స్పీడు ట్రైనులో ముఖ్యమంత్రి బృందం బయల్దేరి వెళ్లింది. బూసన్‌లో ఎంబసీతో కలిసి ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన రోడ్ షో/బిజినెస్ సెమినార్‌లో చంద్రబాబు పాల్గొన్నారు. బూసన్ మెట్రోపాలిటన్ సిటీ వైస్ మేయర్ కిమ్ యంగ్‌వాన్ ప్రసంగిస్తూ ఏపీ ముఖ్యమంత్రి ‘డైనమిక్ లీడర్’ అని ప్రశంసించారు. కొరియా, ఏపీ మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని చెప్పారు. వైద్య - ఆరోగ్యరం గం, వ్యవసాయం, పునరుత్పాదక విద్యుత్, ఓడరేవులు, నగరాల అభివృద్ధి లాటి అనేక అంశాలలో పరస్పర సహకారం ఆవశ్యకతను వివరించారు. బూసన్, ఏపీ మధ్య పరస్పర అనుబంధం ఉభయులకూ ఉపయుక్తంగా ఉండేలా ప్రయత్నిద్దామన్న కిమ్ మాటలను ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తూ స్వాగతించారు. దక్షిణ కొరియాలో భారత రాయబారి దొరైస్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్షిణ కొరియాలోని క్రియాశీల నగరమైన బూసన్‌ను సందర్శించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. క్రియాశీలత, సాంకేతికత, బాహ్య ప్రపంచంతో సంబంధాలు, ఓడరేవుల అభివృద్ధి, తదితర అంశాలలో బూసన్ సిటీకి, ఏపీకి సారూప్యత ఉన్నదని దొరైస్వామి వివరించారు. భారత్‌లో వ్యాపారం చేయాలనుకుంటే ఏపీని మించిన ప్రాంతం మరొకటి లేదని కొరియన్ పారిశ్రామిక వేత్తలకు దొరైస్వామి స్పష్టం చేశారు.
ఏడాది పడుతుందని భావిస్తే 3 నెలల్లోనే పూర్తి
‘కియా’కు ఇచ్చిన ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతాన్ని చదును చేయడానికి కనీసం ఏడాదైనా పడుతుందని భావిస్తే, చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కేవలం 3 నెలలోనే ఆ పని పూర్తి చేయడం విశేషమని, ఆయన క్రియాశీలతకు, వేగవంతమైన పనివిధానానికి ఇదే నిదర్శనమని దొరైస్వామి ప్రశంసించారు. ‘కియా మోటార్స్’కు కేటాయించిన అభివృద్ధి పనుల విశేషాలపై బిజినెస్ సెమినార్‌లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి, వౌలిక సదుపాయాల సంస్థ లఘుచిత్రాన్ని ప్రదర్శించింది.
కొరియన్ భాషలో పలకరించిన చంద్రబాబు
బిజినెస్ సెమినార్‌కు హాజరైన వారిని కొరియన్ భాష లో ‘అన్‌యోంగ్ హోసే’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పలకరించడంతో వారు హర్షధ్వానాలు చేశారు. మళ్లీ కొరియా వచ్చేటప్పుడు కొరియన్ భాషలో ఇంతకంటే మెరుగ్గా మాట్లాడుతానని ముఖ్యమంత్రి చెప్పటంతో కరతాళధ్వనులతో స్వాగతించారు. ఇదిలా ఉంటే తర్జుమా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెజెంటేషన్‌ను బిజినెస్ సెమినార్‌కు హాజరైన పారిశ్రామిక వేత్తలకు కొరియన్ భాషలో అందజేయడం విశేషం. కొరియన్ పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకోవడానికి వారి భాషలోనే ఏపీ సానుకూలాంశాలను వివరించడం ద్వారా పెట్టుబడుల ఆకర్షణకు ముఖ్యమంత్రి తనదైన శైలిలో ప్రయత్నించారు. బిజినెస్ సెమినార్‌లో ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబును కౌన్సిల్ జనరల్ జియోంగ్ డియోక్ మిన్ సాదరంగా స్వాగతించారు. ముఖ్యమంత్రి బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, వాణిజ్యం, పరిశ్రమలు, ఆహారశుద్ధి శాఖల మంత్రి అమరనాథరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ అరోకియా రాజ్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిశోర్, ఏపీఐఐసీ ఎండీ అహ్మద్ బాబు ఉన్నారు.