ఆంధ్రప్రదేశ్‌

మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియం కొనసాగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం మాత్రమే కొనసాగించేలా గతంలో హడావుడిగా 14వ నెంబరు జీవో జారీ చేసిన ప్రభుత్వం తన తప్పిదాన్ని సరిదిద్దుకుంటూ తెలుగు మీడియం సెక్షన్లు కొనసాగించేలా మున్సిపల్ శాఖ కార్యదర్శి ఆర్ కరికర వాలన్ మంగళవారం జీవో 421ను జారీ చేశారు. 14 నెంబరు జీవోపై ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో అధికార పక్షం నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయిన నేపథ్యంలో మునిసిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియం కొనసాగిస్తూ ప్రభుత్వం తాజా జీవో జారీ చేసింది.