ఆంధ్రప్రదేశ్‌

కాపు రిజర్వేషన్లకు నిరసనగా 10న రాష్ట్ర బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ నివేదిక అందకుండానే సభ్యుల నివేదికలతో కాపులను బీసీ జాబితాలో చేర్చుతూ ప్రభుత్వం హడావుడిగా ఉభయ సభల్లో బిల్లును ఆమోదించడాన్ని నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన రాష్ట్ర బంద్ పాటించాలని బీసీ సంఘాలు నిర్ణయించాయి. ఈ నెల ఆరోతేదీన 13 జిల్లాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం, నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపట్టాలని నిర్ణయించినట్టు మంగళవారం స్థానిక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిశెట్టి చక్రవర్తి తెలిపారు. ఈ నెల 10వ తేదీన ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రాష్ట్ర బంద్ నిర్వహించనున్నామన్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ దొడ్డిదారిన వంకరబుద్ధితో బిల్లు ఆమోదించారని అన్నారు. బీసీ వర్గానికి చెందిన వడ్డెర, రజక, కురులు బేస్త, మేదర కులాలను ఎస్టీ జాబితా చేరుస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చి కూడా వారికి మొండిచెయ్య చూపుతూ అన్నింటా ముందంజలో ఉన్న కాపులను బీసీలుగా గుర్తిస్తూ అగ్రకులాలకు తొత్తులుగా మారారంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.