ఆంధ్రప్రదేశ్‌

హజ్ యాత్ర దరఖాస్తుకు రేపటితో ముగియనున్న గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: 2018 హజ్ యాత్రకు నామమాత్రపు స్పందన లభిస్తోంది. 2017 హజ్ యాత్రకోసం 3 వేల 800 మందికి అవకాశం ఉంటే మంగళవారం సాయంవ్రరకు కేవలం 690 మంది మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీతో దరఖాస్తు గడవు ముగియనున్నదని ఈ ఏడాది ఎలాంటి పరిస్థితుల్లోనూ పొడిగింపు ఉండబోదని ఏపీ హజ్ కమిటీ ఇవో మహ్మద్ లియాఖల్ ఆలీ తెలిపారు. ఇప్పటివరకు అత్యధికంగా కర్నూలు నుంచి 143 దరఖాస్తులు రాగా అతి తక్కువగా నెల్లూరు నుంచి మూడు మాత్రమే వచ్చాయన్నారు. హజ్ కమిటీ ద్వారా కేవలం ఒకసారి మాత్రమే హజ్‌కెళ్లి అవకాశం ఉంటుందన్నారు. అయితే మరొసారి వెళ్లేందుకు ఎవరైనా అవాస్తవాలతో దరఖాస్తును నింపి హజ్ యాత్ర చేయడానికి ప్రయత్నిస్తే వారు చెల్లించిన సొమ్ము జప్తు అవుతుందని హెచ్చరించారు.