ఆంధ్రప్రదేశ్‌

గిరిజన ప్రాంతాల్లో వౌలిక వసతులకు ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, డిసెంబర్ 5: గిరిజన ప్రాంతాలలో వౌలిక వసతులు, రవాణా మెరుగుపర్చటం, వసతిగృహాలలో హాజరుశాతం పెంచటంతోపాటు విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు తప్పక నిర్వహించాలని, దీనివలన ప్రభుత్వం ఆశించిన గిరిజన సంక్షేమ పథకాలు వంద శాతం వారికే చెందే అవకాశం వుంటుందని, అందుకు ఆధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా అధికారులను అదేశించారు. మంగళవారం స్థానిక మెట్రోపాలిటన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన రాష్టస్థ్రాయి గిరిజన సంక్షేమ శాఖ సమావేశంలో ఆయన సంచాలకులు గంధం చంద్రుడుతో కలసి అధికారులతో గిరిజన ప్రాంతాలలో అమలు చేయాల్సిన, అమలు చేస్తున్న పథకాలపై సమీక్షించారు. ఇంజనీరింగ్, హెల్త్, ఎడ్యుకేషన్, ట్రైకార్, రవాణా, పరిపాలనా, ఎకౌంట్స్, ఆర్‌వైఎఫ్‌ఆర్, వివిధ పెండింగ్ అంశాలపై సిసోడియా చర్చించారు. ఉపాధి హామీ పథకం కింద సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలోని రోడ్లు కనెక్టివిటీ లేని గిరిజనావాసాలకు డబ్ల్యుబిఎం లెవల్ వరకు రోడ్డు సౌకర్యం పనులు మొదలుపెట్టామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం, చింతూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలో 864.32 కోట్లు అంచనావ్యయంలో 1536 పనులు, 2871 కిలో మీటర్లు పొడవు రోడ్లు నిర్మించుటకు చర్యలు చేపట్టామన్నారు. వీటిలో 834.74 కోట్లతో 1488 పనులు, 2745 కిలో మీటర్ల పొడవు రోడ్డు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయన్నారు. 607.95 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 2084 కిలోమీటర్ల పొడవుగల 1104 పనులు చేపట్టగా, నవంబర్ 29 నాటికి 323.8 కోట్ల ఖర్చుతో 72.59 శాతం పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ పథకం కింద నవంబర్ 29 తేదీ నాటికి 18 పనులు 1.91 కోట్ల ఖర్చుతో చేపట్టగా 15.75 కిలో మీటర్ల పొడవుగల రోడ్లు పూర్తి కాగా, మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు 120 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టగా, 3.48 కోట్ల ఖర్చుతో పనులు జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు బివి బాలయోగి, 13 జిల్లాలకు చెందిన పీవోలు, డీడీలు, ఐటీడీఏలు, ఈఈలు టీడీడబ్ల్యూవోలు తదితరులు పాల్గొన్నారు.