ఆంధ్రప్రదేశ్‌

ముందుగా చర్చించి ఉంటే ఇంత గందరగోళం ఉండేది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయమై ముందుగానీ, నిర్ణయం వెల్లడించిన తరువాత గానీ వెనుకబడిన వర్గాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి ఉంటే ఇంత గందరగోళం ఉండేది కాదని బీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. తాను కూడా వారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉన్న బీసీలకు నష్టం కలిగే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరించబోరని, తమకు కూడా బీసీల ప్రయోజనమే ముఖ్యమనే విషయం ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నానన్నారు. వెనుకబడిన వర్గాలకు నష్టం కలిగించే ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలోనే కాపులకు రిజర్వేషన్ కల్పించామని తెలిపారు. బీసీల మనోభావాలు, ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగతంగా చర్చిస్తానన్నారు. తాను అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అవసరమైతే బీసీ సంఘ ప్రతినిధులతో కూడా చర్చించేందుకు చొరవ తీసుకునే ప్రయత్నం చేస్తానని తెలియజేశారు.