ఆంధ్రప్రదేశ్‌

‘సీపీఎస్’ సమస్యలను పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్)లో ఎదురవుతున్న ఆర్థికపరమైన లోటుపాట్లపై ఎపిసీపీఎస్ ఎంప్లారుూస్ అసోసియేషన్ నేతలు మంగళవారం ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లుతో కల్సి రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్రతో సమావేశమై ప్రధానంగా ఏడు అంశాలపై చర్చించారు. దానిపై రవిచంద్ర స్పందిస్తూ ఇక మున్ముందు జరిగే హెచ్‌వోడీల సమావేశాల్లో సీపీఎప్ సమస్యలను అజెండాలో చేర్చి పరిష్కరిస్తామన్నారు.
ఉద్యోగులపై దాడులను సహించబోం
ప్రభుత్వ ఉద్యోగులపై భౌతిక దాడులను ఇక సహించేది లేదని జెఎసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఎంప్లారుూస్ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ డి.ఈశ్వర్, ఎపిజెఎసి అమరావతి కో చైర్మన్ పి.రామంజనేయులు యాదవ్ హెచ్చరించారు. సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అనంతపురంలో మున్సిపల్ డిఇ కృష్ణప్పపై జరిగిన దాడిని ఖండించారు. దాడికి పాల్పడిన నరసింహారెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించాలన్నారు. ఇప్పటికే ఉద్యోగులు పనిభారాలతో ఒత్తిడికి గురవుతున్న తరుణంలో ఇలాంటి పరిణామాలు మానసికంగా కుంగదీస్తాయన్నారు.