ఆంధ్రప్రదేశ్‌

త్వరలో బలవర్థక బియ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు బలవర్థక బియ్యం (్ఫర్టిఫైడ్ రైస్) సరఫరా చేసేందుకు నిర్ణయించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో టాటా ట్రస్టు ప్రతినిధులతో మంత్రులు సోమిరెడ్డి, నారా లోకేష్ మంగళవారం సమావేశమై ఫోర్టిఫైడ్ రైస్‌పై చర్చించారు. పౌష్టికాహార లోపం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని తెలిపారు. దీనిని అధిగమించేందుకు మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ బియ్యాన్ని పైలట్ ప్రాజ్టెకుగా అందచేస్తామన్నారు. దశలవారీగా రేషన్ దుకాణాల్లో ఇచ్చే బియ్యం బదులుగా ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు కూడా సరఫరా చేస్తామన్నారు. రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొంతమేర పౌష్టికాహార లోపం ఉన్నట్లు అధ్యయనాల్లో వెల్లడైందన్నారు. పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదల బాగా ఉండాలంటే పౌష్టికాహారం తప్పనిసరి అన్నారు. ఈ బియ్యం ద్వారా విటమిన్ ఏ, డీ అందించే అవకాశం ఉందన్నారు. రైస్ ఫోర్ట్ఫికేషన్‌కు రాష్ట్రానికి సహకరించేందుకు టాటా ట్రస్టు ముందుకువచ్చిందన్నారు. బిడ్డ పుట్టిన నాటి నుంచి మొదటి 1000 రోజుల్లో అందించే పౌష్టికాహారంతోనే వారిలో ఎదుగుదల ఉంటుందన్నారు. అధునాతన టెక్నాలజీతో బియ్యాన్ని ఫోర్ట్ఫికేషన్ చేసి సరఫరా చేస్తామని, దీని వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉందన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

మెగాసీడ్ పార్కు కోసం ప్రత్యేక సంస్థ
మెగాసీడ్ పార్కు కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మెగాసీడ్ పార్కు ఏర్పాటుపై అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంస్థ ఏర్పాటుకు సంబంధించి మూడు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. దీనికి సమాంతరంగా సీడ్ పార్కులో పని చేసేందుకు వీలుగా శాస్తవ్రేత్తలు, ఇతర సిబ్బందికి ఐయోవా వర్సిటీలో శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీడ్ పార్క్ నిర్వహణకు సీఈఓను నియమించే అంశంపై కూడా చర్చించారు.
చిత్రం..అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి