ఆంధ్రప్రదేశ్‌

రైతులకు లబ్ధి చేకూర్చటమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: రైతులకు మేలు చేకూర్చటమే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు అనుమతితోనే సరిపెట్టకుండా, వాటి నిర్వహణా తీరు, నిబంధనల ప్రకారం ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలు అమలవుతున్నాయా.. లేదా అని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎఫ్ పీఎస్) ఆధ్వర్యంలో అమలవుతున్న ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2015-20పై మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా ఏపీఎఫ్ పీఎస్ అధికారులు, రాష్ట్రంలో ఎన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పారు? ఎంతమేర పెట్టుబడులు పెట్టారు? ఎంత మందికి ఉపాధి కల్పించారు? అనే విషయాలపై సీఎస్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో రూ. 3,565 కోట్లతో 194 ప్రాజెక్టులకు అనుమతిచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటిలో 126 ప్రాజెక్టుల్లో ఇప్పటికే ఉత్పత్తులు ప్రారంభమయ్యాయని, మిగిలిన 68 ప్రాజెక్టులు నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. 194 ప్రాజెక్టుల ద్వారా 68,016 మందికి ఉపాధి లభించనుందన్నారు. ఈ 194 ప్రాజెక్టుల్లో కర్నూలులో ఏర్పాటు చేయనున్న అల్ట్రా మెగా ఫుడ్ పార్క్‌తోపాటు పండ్లు, కూరగాయలు, మిర్చి, వ్యవసాయాధారిత, చేపలు, మాంసం, పాలతోపాటు పాలాధారిత పరిశ్రమలు ఉన్నాయన్నారు. వాటితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టుల్లో తయారయ్యే ఉత్పత్తులను పరీక్షించే 4 నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఆఫ్ టెస్టింగ్, క్యాలిబ్రేషన్ ల్యాబోరేటరీస్‌తోపాటు 31 కోల్డ్ చైన్ల యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ల్యాబోరేటరీల్లో రెండు ఇప్పటికే ప్రారంభమైతే మరో రెండు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. 31 కోల్డ్ చైన్ యూనిట్లకు గానూ 19 ప్రారంభమయ్యాయని, మరో 12 నిర్మాణ దశలో ఉన్నాయని సీఎస్‌కి అధికారులు తెలిపారు. మంచి ధర వచ్చే వరకు టమోటా పంటలను కోల్డ్‌చైన్‌లో నిల్వ చేసుకునే సౌలభ్యం రైతులకు కల్పించాలన్నారు. రైతులకు ఆర్థిక లబ్ధి చేకూర్చే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు అనుమతులతోనే బాధ్యత తీరిపోయిందని భావించకుండా, పెట్టుబడుదారులు ప్రభుత్వంతో కుదుర్చుకున్న హామీలను నెరవేరుస్తున్నారో లేరో? అని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్రతి జిల్లాలోనూ కనీసం ఒక మహిళా సంఘానికి ఆహార ఉత్పత్తుల తయారీలో మంచి శిక్షణ ఇచ్చి ఆ సంఘ సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆదేశించారు.