ఆంధ్రప్రదేశ్‌

త్వరితగతిన టెండర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీ తొలిదశ పనులు ప్రారంభానికి వీలుగా త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో భూగర్భ డ్రైనేజీ అమలుపై సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలిదశలో 157 గ్రామాల్లో ఏర్పాటు చేయనున్నామన్నారు. 1340 గ్రామాల్లో 10 వేల కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నాణ్యతతోపాటు 3 సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతలు ఆయా కంపెనీలే నిర్వహించేలా నిబంధన పొందుపరచాలన్నారు. కనీసం 30 సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. గురువారం లోపుఅనుమతులు, ప్రణాళిక పూర్తి చేయాలన్నారు. అనంతరం అంటువ్యాధులు, క్లోరినేషన్ తదితర అంశాలపై జరిగిన సమీక్షలో మాట్లాడుతూ ఓవర్‌హెడ్ ట్యాంక్‌లను తరచూ శుభ్రం చేయాలని ఆదేశించారు. దోమ లార్వా పెరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లలో, కళాశాలల్లో మరుగుదొడ్ల శుభ్రం చేసేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, ఇందుకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలన్నారు.

చిత్రం..అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్