ఆంధ్రప్రదేశ్‌

రాజకీయాల ప్రక్షాళనకే జనసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 6: దేశంలో రాజకీయ వ్యవస్థ కుళ్లిపోయిందని, రాజకీయ నాయకుల దోపిడీతో వ్యవస్థ భ్రష్టుపట్టిందని, ఈ పరిస్థితిని మార్చి, రాజకీయాలకు కొత్త రక్తం ఎక్కించేందుకే తాను జనసేన పార్టీని స్థాపించానని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అవినీతి రాజకీయాలతో దేశాన్ని బీడుగా మార్చేశారని, దాన్ని తిరిగి సస్యశ్యామలం చేసేందుకు తను రంగంలో దిగానని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భవించిన తరువాత మొట్టమొదటి పార్టీ కార్యకర్తల సమావేశం ఉత్తరాంధ్ర జిల్లాల కార్యకర్తలతో బుధవారం విశాఖలో జరిగింది. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఎన్నికలకు కార్యోన్ముఖులను చేసే విధంగా ప్రసంగించారు. భయంతో వెనె్నముక వంగిపోయే వ్యవస్థను నేటి రాజకీయ పార్టీలు తయారు చేశాయి. భయంలేని వ్యవస్థను నిర్మించేందుకు తాను నడుంబిగించానని పవన్ అన్నారు. అన్యాయాన్ని ఎదిరించే మనస్తత్వం నాది. ప్రజలు బాధపడితే తట్టుకోలేను. తనలా ఆలోచించేవారు మాత్రమే తనతో నడవాలని పవన్ చెప్పారు. సినిమాల్లో హీరోయిజాన్ని ప్రదర్శించి, బయట స్వార్థంతో వ్యవహరించడం తనకు తెలియదు. గడచిన 25 ఏళ్ళుగా తనను తాను నిగ్రహించుకుని, ప్రజా సేవకు అనుగుణంగా మలుచుకున్నాను. ‘నా మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను.’ అని ఆయన అన్నారు. ఇప్పుడు సినిమాలు పక్కన పెట్టేశాను. రాజకీయాల్లో ఓడిపోయినా, దెబ్బలుతిన్నా కుళ్లు పట్టిన వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నది తన సంకల్పమని అన్నారు. తను రష్యా టోపీ, లండన్ సూట్, జర్మన్ షూస్ వాడినా, హృదయం మాత్రం భారతదేశానిదే, అది ఇక్కడి ప్రజల కోసమే నిరంతరం తపన పడుతుందని పవన్ అన్నారు. బ్రిటిష్ ఇండియా నుంచి బ్రిటిష్‌ను పారదోలడానికి గాంధీ ఆరోజు ప్రయత్నించకపోయి ఉంటే, మనం ఇప్పుడు స్వేచ్ఛా భారతాన్ని అనుభవించలేకపోయేవారమని అన్నారు. దేశంలో దాదాపూ అన్ని రాజకీయ పార్టీలు కులాలు, మతాల పరంగా విడిపోయాయని, జాతీయ భావం ఉన్న పార్టీ ఎందుకు ఉండకూదన్న ఆలోచన ఎప్పుడూ తన మదిలో మెదులుతుంటుందని పవన్ అన్నారు. తను మరణించేలోగా దేశానికి ఏం చేయగలనన్న వేదన వేధిస్తుంటుందని అన్నారు. మన దేశంలో వంశపారంపర్య రాజకీయాలు నడుస్తున్నాయి. వాటికి స్వస్తి పలకాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి మరణించిన వెంటనే, ఆయన కుమారుడు ఆ పదవి కోసం ప్రయత్నించడం హేయమైన చర్యగా పవన్ అభివర్ణించారు. సీఎం కావాలనుకున్న వ్యక్తి తనేంటో నిరూపించుకుని ఆ పదవిని చేపట్టాలని జగన్‌పై పవన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలతో జతకట్టానని చాలా మంది తనను ప్రశ్నించారని, రాజకీయాల్లో ఎదగాలంటే, ఏదో ఒక పార్టీ అండ తీసుకోవాలి. చిన్న మొక్క, పెద్ద చెట్టును ఆసరాగా తీసుకుని ఎదుగుతుంది. బీజేపీని, టీడీపీని వెనకేసుకు వస్తున్నారని కొంతమంది తనతో అంటుంటారు. ఏ పార్టీకి ఉన్న అనుభవం ఆ పార్టీకి ఉంది. పార్టీలు, ప్రభుత్వాల అనుభవాన్ని ఆకళింపు చేసుకుని ఇప్పుడు ఓ పార్టీ అధినేతగా ప్రజల ముందుకు వచ్చానని పవన్ చెప్పారు.
ప్రస్తుతం చాలా మంది రాజకీయ నాయకులు వేల కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే, వారు సంతృప్తి చెందుతారని పవన్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత లక్ష కోట్లు ఆర్జించాడని అధికార పక్షం. అలాగే అధికార పక్షం లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ప్రతిపక్షణ విమర్శించుకుంటున్నాయి. దొంగ, దొంగ డబ్బులు పంచుకుని, జనాన్ని గాలికొదిలేస్తున్నారని ఆయన విమర్శించారు. అందుకే అవినీతిలో కూరుకుపోయిన వైసీపీకి తాను మద్దతు ఇవ్వదలచుకోలేదని పవన్ స్పష్టం చేశారు. అలాగని జగన్‌పై తనకు ఎటువంటి ద్వేషం లేదని ఆయన చెప్పారు. డబ్బు, అధికార దాహం నేటి రాజకీయ నాయకుల్లో పేరుకుపోయిందని చెప్పారు.

ఏ పార్టీకీ మద్దతు ఇవ్వను

విశాఖపట్నం, డిసెంబర్ 6: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశ, రాష్ట్ర రాజకీయాలపై ఘాటుగా స్పందించారు. బీజేపీ, టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీల నేతలపై విమర్శనాస్త్రాలను సంధించారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ) ప్రైవేటీకరణకు మనస్తాపం చెంది ఆ సంస్థ ఉద్యోగి వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన కుటుంబాన్ని ఓదార్చేందుకు పవన్ కళ్యాణ్ బుధవారం ఇక్కడికి వచ్చారు. డీసీఐ ఉద్యోగులు చేస్తున్న దీక్షా శిబిరం వద్ద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తరువాత జరిగిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారులుగా ఉండాలి. ఓట్లు కావల్సి వచ్చినప్పుడు ప్రజల వద్దకు వెళ్లే నాయకులు, సమస్యల గురించి అడిగితే, హైకమాండ్‌ని అడిగి చెబుతామని తప్పించుకుంటున్నారని విమర్శించారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా సమస్యలను విస్మరించి, బుగ్గకార్లలో తిరుగుతున్న రాజకీయ నాయకులను ఎందుకు నిలదీయకూడదని పవన్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కరించని నాయకులకు 2019లో ఓట్లు అడిగే హక్కు లేదని ఆయన అన్నారు. తను బీజేపీకి, టీడీపీకి, వైసీపీకి మద్దతు ఇవ్వడం లేదు. దేశ రాజకీయాల్లో మార్పు వస్తుందని భావించి ప్రజలకు అండగా నిలిచానే తప్ప, బీజేపీకి ఆనాడు అండగా నిలబడలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల బరిలో దిగుతాను. యువతకు ప్రాధాన్యం ఇస్తానని పవన్ వెల్లడించారు. నాలుగేళ్ళుగా రాష్ట్రంలో, దేశంలో ఏదో అద్భుతం జరుగుతుందని ఊహించుకున్నాను. కానీ జరగలేదన్నారు.

పీఆర్పీకి ద్రోహం చేసిన వారిని వదలను

విశాఖపట్నం, డిసెంబర్ 6: ప్రజారాజ్యం పార్టీకి ద్రోహం చేసిన వారెవ్వరినీ వదిలిపెట్టనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. బుధవారం ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడుతూ చిరంజీవి గొప్ప వ్యక్తి. ప్రజలకు మంచి చేయాలన్న వ్యక్తిత్వం ఉన్న మనిషి. ముఖ్యమంత్రి కావల్సిన వ్యక్తిని కొంతమంది తమ లబ్ధికోసం పార్టీని బలిపెట్టారు. దీనికి కారణమైన ఎవరెవరన్నది నాకు బాగా తెలుసు. వారిలో ఏ ఒక్కరిని వదిలిపెట్టనని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పీఆర్పీలో చిత్తశుద్ధి లేనివారంతా చేరడంవలనే పార్టీ నాశనమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్పుకోసం వచ్చిన జననేతకి పార్టీలోని వారే ద్రోహం చేశారని అన్నారు. అధికారంలోకి రావల్సిన పీఆర్పీ ఓటమి తనను ఎంతగానో బాధించిందని ఆయన అన్నారు. ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా, నా కడుపు తరుక్కుపోతుందని, కళ్లు చమర్చుతాయని పవన్ ఉద్వేగంగా చెప్పారు. పార్టీకి ద్రోహం చేసిన ప్రతి ఒక్కడూ తనకు తెలుసని, గుండెల్లోనే దాచుకున్నానని పవన్ చెప్పారు. పీఆర్పీ ద్రోహులకు జనసేనతోనే చెంపదెబ్బకొడతానని పవన్ అన్నారు. అన్నయ్యకు జరిగిన అన్యాయం నన్ను కలిచివేస్తోంది. పార్టీకి ద్రోహం చేసిన వారిని శిక్షించే శక్తి ఇవ్వమని దేవుడ్ని ప్రార్థిస్తుంటాను. ఆ శక్తిని దేవుడు మీ రూపంలో ప్రసాదించాడని పవన్ చెప్పారు. పీఆర్పీకి ఉన్నంత బలం తనకు లేదు. ఆ పార్టీకి చాలా మంది విరాళాలు ఇచ్చారు. ఇప్పటి వరకూ తనకు ఎవ్వరూ విరాళాలు ఇవ్వలేదు. ఇప్పుడిప్పుడే విరాళాలు ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. పీఆర్పీలో ఉన్నంత లగ్జరీ నాదగ్గర లేదని పవన్ స్పష్టం చేశారు. పీఆర్పీకి ఉన్న అభిమానులు కూడా నాకు లేరని పవన్ అన్నారు.