ఆంధ్రప్రదేశ్‌

బెజవాడలో రౌడీషీటర్ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట), డిసెంబర్ 6: విజయవాడ నగరంలో పట్టపగలే నడిరోడ్డుపై రౌడీషీటర్ కాళిదాసు సుబ్రహ్మణ్యం(35)ను దుండగులు పాశవికంగా హత్య చేశారు. ఈ సంఘటన బుధవారం ఉదయం నగరంలోని మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబ్రహ్మణ్యం నగరంలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో టీవీ కొనటానికి వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి మాచవరం రమ్మని పిలిచారు. దీంతో అతను మాచవరం డౌన్ ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ మాటువేసిన ఆరుగురు దుండగులు మూడు బైక్‌లపై వచ్చి విజయకృష్ణ సూపర్ మార్కెట్ దగ్గరలోని టీస్టాల్ వద్ద గొడ్డళ్లు, కత్తులతో అతనిపై దాడి చేసి దారుణంగా నరికి చంపారు. సంఘటనా స్థలంలోనే రక్తపు మడుగులో సుబ్రహ్మణ్యం ప్రాణాలు విడిచాడు. డీసీపీ గజరాజ్ భూపాల్ నేర స్థలాన్ని పరిశీలించారు. హత్యకు పాతకక్షలే కారణమని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. సుబ్రహ్మణ్యం ఏడు నెలల క్రితం గుంటూరు జిల్లా తెనాలి నుంచి నగరానికి వచ్చి న్యూరాజరాజేశ్వరిపేటలో భార్యాబిడ్డలతో కలిసి నివాసముంటున్నాడు. గతంలో తెనాలి పోలీసు స్టేషన్‌లో అతనిపై రౌడీషీట్ నమోదై ఉంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో అక్రమంగా తుపాకీ కొంటూ పోలీసులకు పట్టుబడటంతో జైలుకు పంపగా, తరువాత బెయిల్‌పై బయటికి వచ్చాడు. కాగా, ఈ హత్య వెనుక మాచవరానికి చెందిన టీడీపీ యువ నాయకుడి హస్తం ఉందని మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. అయితే పోలీసులు మోటార్ బైక్‌ల ఆధారంగా తెనాలికి చెందిన సముద్రాల పవన్‌కుమార్, టీ సురేంద్రలను నిందితులుగా గుర్తించారు.