ఆంధ్రప్రదేశ్‌

రైతుల కష్టాన్ని దోచుకుంటున్న సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 6: రాష్ట్ర ప్రజలు, రైతుల కష్టాలు పట్టించుకోకుండా, తన స్వలాభం, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తూ, రైతుల కష్టాన్ని దోచుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ దళారీ అని వైకాపా అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా సంకల్పయాత్ర 28వరోజు బుధవారం అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెలలో జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ ‘చంద్రబాబుకు హెరిటేజ్ అనే సంస్థ ఉంది. దాని కోసం తక్కువ ధరకే వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తారు. వాటిని అందంగా ప్యాక్ చేయించి మార్కెట్లో అధిక ధరకు మనకే అమ్మేస్తుంటారు. మరోవైపు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల లేకుండా చేసి వారినీ దళారులకు అమ్మేశారు. ఆయనే ఓ దళారీ కాబట్టి ఈపని చేస్తున్నారన్నాని’ విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల చంద్రబాబు ప్రభుత్వంలో మహిళా సంఘాలు, రైతుల రుణాల మాఫీ చేయక పోవడాన్ని మనం చూశామని, బ్యాంకుల్లో వడ్డీ లేని రుణాలు రైతులకు అందడం లేదన్నారు. తాకట్టుపెట్టిన బంగారం బయటకు రాలేదని, మహిళా సంఘాలకు రుణమాఫీ జరగలేదని, ఇది అన్యాయమైన పాలన అని దుయ్యబట్టారు. నవరత్నాల్లో మహిళలు, విద్యార్థులు, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. మీ అందరి ఆశీస్సులు, దేవుడి ఆశీర్వాదంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాగానే రైతుల కష్టాలు తీరుస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీంటినీ పూర్తి చేస్తామని, పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్కుల నీటిని తరలిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రైతుకూ వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు ఉచిత కరెంటు ఇస్తామన్నారు. జూన్‌లో పంటల సాగుచేయడానికి ముందే మే నెలలో ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 పెట్టుబడిగా అందజేస్తామన్నారు. రూ.3000 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని, కరవు, అకాలవర్షాల కారణంగా రైతన్నలు సమయంలో ఆదుకోవడానికి ఈ మొత్తాన్ని వినియోగిస్తామన్నారు. ర కరవు తాండవిస్తున్నా, కరవు మండలాలను ఈ ప్రభుత్వం ప్రకటించలే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు. రూ.2,000 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారని, అది ఏమైందని నిలదీశారు.