ఆంధ్రప్రదేశ్‌

పోలవరం బాధ్యత కేంద్రానిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 6: రాష్ట్రంలో టీడీపీతో పొత్తు కొనసాగుతున్నంత కాలం మిత్రపక్షంగా తాము విమర్శలకు దిగబోమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు స్పష్టం చేశారు. విశాఖలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో టీడీపీ నాయకులు బీజేపీ తీరుపై చేస్తున్న విమర్శలపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సంయమనంతో సమాధానం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు సహా పలు కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ గొప్పతనంగా ప్రచారం చేసుకుంటోందంటూ ఇటీవల బీజేపీ నేతల ప్రకటనలపై టీడీపీ నేతలు స్పందిస్తూ డూప్లికేట్ నాయకులుగా చిత్రీకరించడంపై బీజేపీ వైఖరి ఏమిటని ప్రశ్నించగా, వారు మాట్లాడుతున్నారని, మేం మాట్లాడితే ఇక మిత్రబంధం ఏముంటుందని సమాధానమిచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారన్న అంశం పూర్తిగా అప్రస్తుతమని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న విధంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందన్నారు. కొన్ని సాంకేతిక కారణాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలు కోరడం, లేఖలు రాయడం జరుగుతోందని, ఈ విషయంలో ఎటువంటి అపోహలకు తావు లేదని ఉద్ఘాటించారు. చిన్న చిన్న సమస్యలను రాజకీయ చిత్తశుద్ధితో పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణలో బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కాపులకు విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ టీడీపీ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి, కేంద్రానికి నివేదించడంపై ఆయన స్పందించారు. గుజరాత్‌లో పటేళ్లు, మహారాష్టల్రో మరాఠీలు, రాజస్థాన్‌లో జాట్‌లు బీసీ రిజర్వేషన్లు కోరుతూ ఆందోళనలు చేస్తున్నాయని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా పలు కులాలు బీసీల్లో చేర్చాలని కోరుతూ వస్తున్న విజ్ఞప్తుల మేరకు బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ అంశంపై స్పందిస్తూ వాటి సామర్థ్యాన్ని పెంచేందుకే కేంద్రం నిర్ణయాత్మకంగా ముందుకు సాగుతుందన్నారు. కార్మికులు ఆవేశాలు, భావోద్వేగాలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం దేశ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణమే నెలకొంటుందని మురళీధర రావు అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి, 2019 ఎన్నికలకు సమాయత్తం అవుతుందన్నారు.