ఆంధ్రప్రదేశ్‌

విదేశీ పర్యటనలు వృథా ప్రయాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, డిసెంబర్ 6: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న విదేశీ పర్యటనల వల్ల ప్రజాధనం వృథా కావడం తప్ప దేశం, రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు ఉండవని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. బుధవారం అనంతపురం జిల్లా మడకశిరలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం అమలు చేయకుండా ప్రజల నుండి తప్పించుకుని తిరగడానికి విదేశీ పర్యటనలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని దేశాలు తిరిగినా పరిశ్రమలు రావన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం, రాష్ట్రం ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడమే సరిపోయిందన్నారు. 2019 నాటికి కూడా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయలేరన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.58 వేల కోట్లు అవసరం కాగా కేంద్రం అరకొరగా బిక్షం వేసినట్లు నిధులు విడుదల చేయడం అన్యాయమన్నారు. పోలవరంపై కేంద్ర మంత్రి గడ్కరీ ఒకటి చెబితే రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావు మరోటి చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. పోలవరం పూర్తి చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులపై చంద్రబాబు ప్రోద్భలంతోనే దాడులు జరుగుతున్నాయని రఘువీరా ఆరోపించారు. అధికారులపై దాడులు జరుగుతున్నా అందుకు బాధ్యులైన వారిని ఎందుకు శిక్షించడం లేదని ప్రశ్నించారు. చేయని పనులకు అధికంగా బిల్లులు చేసుకుంటూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని అన్నారు.
.