ఆంధ్రప్రదేశ్‌

‘పోలవరం’ మాటున ఇసుక దందా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 6: అఖండ గోదావరి ఎడమ గట్టుపై ఇసుక దందా కొనసాగుతోంది..పోలవరం నిర్మాణ పనుల మాటున ఇసుక అక్రమ రవాణా యధేచ్ఛగా జరిగిపోతోందని తెలుస్తోంది..సీతానగరం మండలం కాటవరం ఇసుక ర్యాంపు నుంచి ప్రభుత్వ పనులకు ఇసుక ఉచితంగా తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ అనుమతిని అడ్డు పెట్టుకుని ఇసుక అక్రమ రవాణా జరిగిపోతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అన్ని రకాల అనుమతులు ఉన్నాయని సదరు నిర్మాణ సంస్థల రవాణా కాంట్రాక్టర్లు ఇసుక దందాకు పాల్పడుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కాటవరం ర్యాంపు నుంచి గృహ నిర్మాణానికి, పోలవరం పనులకు సంబంధించి ఇసుక కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ర్యాంపుల్లో మైనింగ్ శాఖ నిర్ధేశించిన పరిధికి లోబడి ఇసుకను మాన్యువల్‌గా తీసుకోవాల్సి వుంది. ఈ విధంగా తీసిన ఇసుకను ట్రాక్టర్లతో ఒడ్డున స్టాక్ పాయింట్‌లో నిల్వ చేసుకుని అక్కడ నుంచి రవాణా చేసుకోవాలి. అయితే పోలవరం పనుల నిమిత్తం కేటాయించిన ఇసుక అక్రమ రవాణా జరిగిపోతోందని తెలుస్తోంది. భారీ లారీలతో విశాఖ వైపు తరలిస్తూ విక్రయాలు సాగిస్తున్నట్టు స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ 5వ ప్యాకేజీలో ఇంకా పనులు ప్రారంభం కాలేదు. కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళే ఇసుక ఎక్కడికి పోతోందో అధికారులకే తెలియాలి. దీనికి తోడు నిర్ధేశిత మార్కింగ్‌లో కాకుండా అక్రమంగా కూడా తవ్వకాలు జరుగుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. బాహాటంగానే ఇసుక దందా సాగుతున్నప్పటికీ అధికారులు చోధ్యం చూస్తున్న చూస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇసుకను తీయాల్సి ఉంది. ఈ మేరకు రోజుకు సుమారు 90 భారీ లారీలు, టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా జరిగిపోతోంది. గృహ నిర్మాణ సంస్థ పట్ల అధికార యంత్రాంగం చాలా ఉదారంగా వ్యవహరిస్తోంది.
రాజమహేంద్రవరంలో 4200 ఇళ్ళ అపార్టుమెంట్ల నిర్మాణానికి సంబంధించి ఎన్‌సిసి సంస్థకు గాయత్రి ర్యాంపులో 5వేల క్యూబిక్ మీటర్లు, కోటిలింగాలర్యాంపులో 5వేల క్యూబిక్ మీటర్లు, కాటవరం ర్యాంపులో 40వేల క్యూబిక్ మీటర్లు, కోరుమిల్లి, కోరుమిల్లి-3లో 7000 క్యూబిక్ మీటర్లు, కపిళేశ్వరపురం-2 ర్యాంపులో 4500 క్యూబిక్ మీటర్లు, జొన్నాడ-4 ర్యాంపులో 2,500, కొత్తపేట కేదార్లంక-2, మందపల్లి-1లో 4వేలు వెరసి 68వేల క్యూబిక్ మీటర్ల ఇసుక కేటాయించారు.