ఆంధ్రప్రదేశ్‌

బీసీలకు నష్టం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 6 : రాష్ట్రంలో కాపుల రిజర్వేషన్ల వలన వెనుకబడిన వర్గాల వారికి ఎలాంటి నష్టం వాటిల్లదని కాపు కార్పొరేషన్ చైర్మన్ సిహెచ్ రామానుజయ అభిప్రాయపడ్డారు. బుధవారం ఒంగోలులోని ఎన్‌ఎస్‌పి అతిధి గృహంలో విలేఖర్లతో మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుండి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బిసిలు, కాపులు ఇద్దరూ సోదరులవలె మెలుగుతున్నారని తెలిపారు. 70 సంవత్సరాల క్రితం విడిపోయిన వాటి గత స్మృతులు గుర్తు చేసుకుంటూ బిసిలు, కాపులు పండుగలు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కాపులను బిసిల్లో చేర్చుతానని ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నారన్నారు. బిసిలకు ఏ మాత్రం నష్టం లేకుండా విద్యా , ఉద్యోగ పరమైన రిజర్వేషన్లు కాపులు కోరారన్నారు. కాపులు నిజంగా అన్ని రంగాల్లో వెనుబడి ఉన్నారని, రిజర్వేషన్లు కల్పించడంలో ఎలాంటి అభ్యంతరాలు రాలేదన్నారు. ముఖ్యమంత్రి చక్కని ఫార్ములాతో కాపులకు రిజర్వేషన్లు కల్పించారని, బిసిలు, కాపులు రెండు కళ్ళు లాంటివారని చెప్పారన్నారు. ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని అందరూ అభినందించాలన్నారు. రాష్ట్రాన్ని వ్యవసాయ దేశంగా తీర్చిదిద్దేందుకు బిల్‌గేట్స్ భాగస్వామ్యంతో కొత్త తరహా వ్యవసాయాన్ని తీసుకు వచ్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు