ఆంధ్రప్రదేశ్‌

నేడు విశాఖకు రాష్టప్రతి రెండు రోజుల పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 6: రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ తొలిసారిగా విశాఖ రానున్నారు. గురువారం నుంచి రెండు రోజుల పాటు రాష్టప్రతి నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశాఖ ఆర్కే బీచ్‌లో విశాఖ నగరాభివృద్ధి సంస్థ(వుడా) ఏర్పాటు చేసిన టీయూ-142 విమాన మ్యూజియంను ప్రారంభిస్తారు. అనంతరం ఆంధ్రా యూనివర్శిటీలో ఈ-క్లాస్‌రూం కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్‌ను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి నగరంలోని అంబేద్కర్ మెమోరియల్ స్కూల్‌ను రాష్టప్రతి సందర్శిస్తారు. అక్కడ నుంచి తూర్పునౌకదళం ఆఫీసర్స్ మెస్‌కు చేరుకుని ఐఎన్‌ఎస్ కల్వరి తపాలాబిళ్లను ఆవిష్కరిస్తారు. అనంతరం నౌకాదళం ఇచ్చే విందులో పాల్గొంటారు. శుక్రవారం ఉదయం నౌకాదళ జలాంతర్గాములకు కలర్స్ ప్రజెంటేషన్‌లో పాల్గొటారు. అనంతరం నౌకదళం గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. అనంతరం ఎన్‌ఐ జెట్టీ వద్ద నౌకాదళ ప్రతినిధులతో ఫోటో కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.
గీతం కళాశాల విద్యార్థి ఆత్మహత్య
విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 6: ఇక్కడి గీతం కళాశాలకు చెందిన మెడికల్ విద్యార్థి హాస్టల్ మూడో అంతస్తు పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రుషికొండ సమీపంలోని గీతం కళాశాలలో హైదరాబాద్‌కు చెందిన కె.శశికుమార్(19) బి-్ఫర్మసీ చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం హాస్టల్ మూడో అంతస్తు పై నుండి దూకడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే శశికుమార్ మృత్యువాత పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మద్యం సేవించి హాస్టల్‌కు రావడంతో వార్డెన్ గమనించి మందలించడంతో మనస్తాపానికి గురై మృతి చెందినట్టు తోటి విద్యార్థులు తెలిపారు. ఆరిలోవ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.