ఆంధ్రప్రదేశ్‌

మచిలీపట్నానికి సమీపంలో వాయుగుండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 6: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం సాయంత్రానికి మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 1020 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. ఇది ఉత్తవ వాయువ్య దిశగా కదులుతూ రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల వైపు కదులుతోందన్నారు. దీని ప్రభావం ప్రస్తుతానికి పెద్దగా లేనప్పటికీ వచ్చే 24 గంటల అనంతరం ఒక మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాల నేపథ్యంలో మత్స్యకారులను వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేసినట్టు తెలిపారు. తీరం అంతటా పోర్టుల్లో ఒకటవ నెంబర్ ప్రమాద సూచీ ఎగురవేసినట్టు వెల్లడించారు. గంగవరం, కాకినాడ పోర్టుల్లో సెక్షన్ సిగ్నల్ 5 ప్రకటించామన్నారు.