ఆంధ్రప్రదేశ్‌

మాజీ మంత్రి జానకిరామ్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయగిరి, డిసెంబర్ 6: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మాదాల జానకిరామ్ (67) బుధవారంనాడు నెల్లూరులోని బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రెండురోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో బంధువులు ఆయనను వైద్యశాలలో చేర్పించారు. ఈక్రమంలో ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో బుధవారం మృతి చెందారు. దుత్తలూరు మండలం ఉలవవారిపాళెంకు చెందిన మాదాల జానకిరామ్ 1978లో రాజకీయ ప్రవేశం చేశారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి జనతా అభ్యర్థి వెంకయ్యనాయుడి చేతిలో ఓటమిపాలయ్యారు. 1989 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కంభం విజయరామిరెడ్డిపై పోటీ చేసి గెలుపొందారు. 1991-92 సంవత్సరాల్లో సిఎం నేదురుమల్లి జనార్ధనరెడ్డి కేబినెట్‌లో భూగర్భ, గనులశాఖ సహాయ మంత్రిగా రాణించారు. అదే సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఢిల్లీలోని ఆ పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. జై ఆంధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1970లో ఆంధ్రసేన వ్యవస్థాపకుల్లో మాదాల జానకిరామ్ కూడా ఒకరు. నాగార్జునసాగర్ ఎడమకాలువ సాధనకై ఉద్యమం చేపట్టారు. ఈయన మృతి పట్ల శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, సీనియర్ నాయకులు, తదితరులు సంతాపం వెలిబుచ్చారు.