ఆంధ్రప్రదేశ్‌

రాజ్యాంగ ఫలాలు అణగారిన వర్గాలకు అంథాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 6: బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగ ఫలాలు దిగువ స్థాయి వారికి చేరాలంటే సచివాలయ ఉద్యోగుల బాధ్యతలే కీలకమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. వెలగపూడి సచివాలయం 3వ బ్లాక్ మొదటి అంతస్తు సమావేశ మందిరంలో బుధవారం మధ్యాహ్నం సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 62వ అంబేద్కర్ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్‌కు దేశంలో సంస్కృతం నేర్పించకపోతే ఆయన జర్మనీ వెళ్లి ఆ భాష నేర్చుకున్నారని తెలిపారు. భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న కుల వ్యవస్థ మూలాలను పెకలించేందుకు, సంస్కృతంలో ఉన్న మను ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి అందులోని విషయాలను తెలుసుకుని దానిని తగులబెట్టారని చెప్పారు. ఆయన చదువునే ఆయుధం గా చేసుకుని మనువాదం, కుల వ్యవస్థ, అంటరానితనంపై పోరాటం చేశారన్నారు. దేశంలోని ప్రజలందరూ అన్నదమ్ముల్లా ఐకమత్యంతో ముం దుకు వెళుతున్నామంటే ఆయన రూపొందించిన రాజ్యాంగ వల్లనేనని, మన రాజ్యాంగంలోని అంశాలను చూసి ప్రపంచ దేశాలు హర్షిస్తున్నాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల ప్రమోషన్ల విషయంలో పోరాటం చేయవలసిరావడం బాధాకరంగా ఉందన్నారు. దేశంలో ఉన్న చట్టాలను సక్రమంగా అమ లు చేస్తే కుల వివక్ష దానంతట అదే పోతుందని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల్లో వివక్షకు గురైన వారు పీడిత, అణగారిన వర్గాలు, మహిళలకు న్యాయం కోసం అంబేద్క ర్ శ్రమించారని, ఆ విధంగా ఆయ న అందరివాడని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర అన్నారు. సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు కత్తి రమేష్ మాట్లాడుతూ భారతదేశమంటే అంబేద్కర్‌కు ముందు, తరువాత అనే ఆలోచన చేసే రోజులు వస్తాయన్నారు. కుల వివక్ష పోరాట సమితి అధ్యక్షుడు మాల్యాద్రి మాట్లాడు తూ దేశంలో కుల సమస్యలను అంబేద్కర్ స్వానుభవంతో పరిశీలించి పరిష్కార మార్గాలను కనుగొన్నారన్నారు. ప్రమోషన్ల విషయంలో న్యాయం కోసం అన్ని సంఘాల నాయకులతో ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయించాలని ఆయన శివాజీని కోరారు. తొలుత కారెం శివాజీ, రవిచంద్రలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.