ఆంధ్రప్రదేశ్‌

పురపాలక ఉపాధ్యాయుల పదోన్నతులకు షెడ్యూల్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 6: రాష్ట్రంలోని పురపాలక, నగరపాలక సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేస్తూ మున్సిపల్ డైరెక్టర్ కె కన్నబాబు ఆర్‌సీ నెం 3276ను బుధవారం విడుదల చేశారు. మున్సిపల్ టీచర్ల పదోన్నతులకు గత నెలలోనే పురపాలక శాఖ ఉత్తర్వులిచ్చినప్పటికీ సర్వీస్ రూల్స్, పదోన్నతుల సీనియార్టీ జాబితాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆ షెడ్యూల్‌ను వాయిదా వేసారు. తాజాగా పదోన్నతుల అమలుకు సంబంధించిన అంశాలపై శాఖాపరంగా మార్గదర్శకాలు ఇవ్వడంతో నూతన షెడ్యూల్‌ను ఖరారు చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు టీచర్ల సీనియారిటీ జాబితాల తయారీ, ఖాళీల ప్యానల్ లిస్టులను తయారు చేసి పదోన్నతుల కమిటీకి అందజేస్తారు. 11వ తేదీ నుండి 12వ తేదీ వరకు రెండు రోజులపాటు ప్యానెల్ కమిటీ సమావేశం. 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు హైస్కూల్ హెచ్‌ఎం, పీఎస్‌హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్ తత్సమాన క్యాడర్ల టీచర్లకు మున్సిపల్ ఆర్‌డీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పదోన్నతుల కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. 17వ తేదీ నుండి 18వ తేదీ వరకు పదోన్నతుల కాపీలను జారీ చేస్తారు.