ఆంధ్రప్రదేశ్‌

నేడు పోలవరాన్ని సందర్శించనున్న వైఎస్‌ఆర్‌సీపీ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించేందుకు వైఎస్‌ఆర్‌సిపి ప్రజా ప్రతినిధుల బృందం ఈ నెల 7వ తేదీన బయలుదేరుతుందని ఆ పార్టీ ఎంపి వైవి సుబ్బారెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలు, కేంద్రప్రభుత్వ సాగదీత ధోరణి తదితర అంశాలపై క్షేత్రస్థాయి పోరాటానికి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కార్యాచరణ రూపొందిస్తున్నారని అన్నారు. బుధవారం నాడిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టును కేంద్రం బాధ్యత తీసుకుని పూర్తి చేస్తుందని హామీ ఇస్తే ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టు ద్వారా అవినీతికి పాల్పడేందుకు కేంద్రం నుంచి ఆ బాధ్యతను స్వీకరించారని విమర్శించారు. కేంద్రం లేవనెత్తిన కొన్ని సాంకేతిక అంశాలపై ఇంతవరకు చంద్రబాబు ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వలేదని అన్నారు. గతంలో ఉన్న అంచనాలను బట్టి కేంద్రం నిధులు ఇచ్చేందుకు ముందుకు వస్తే కొత్త అంచనాలతో ప్రాజెక్టు వ్యయం పెంచడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. చంద్రబాబు నాయుడు ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు. చివరకు తెలు గు గంగ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పునాది వేస్తే దానిని వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేశారని సుబ్బారెడ్డి వివరించారు. తమ పార్టీ ప్రతినిధుల బృందం పోలవరం సందర్శించి వచ్చిన తర్వాత సమగ్ర నివేదిక అందిస్తారని, ఆ తర్వాత అధ్యక్షుడు జగన్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు.