ఆంధ్రప్రదేశ్‌

త్వరలోనే అయోధ్య రామమందిర నిర్మాణ పనులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 6: త్వరలోనే అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు ప్రారంభిస్తామని విశ్వహిందూ పరిషత్ ఆఖిల భారత కార్యదర్శి కె.కోటేశ్వరశర్మ ప్రకటించారు. అయోధ్య కరసేవకులు మందిరం నిర్మాణం కోసం తీసుకువెళ్ళిన రామశిలలతోనే భవ్య మందిర నిర్మాణం జరుగుతోందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తొలిసారిగా అయోధ్య కరసేవక సమ్మేళనాన్ని శౌర్యదివస్ పేరిట అయోధ్య శ్రీరామమందిర నిర్మాణ సాధన సమితి బుధవారం నాడిక్కడ నిర్వహించింది. మునిపల్లి శ్రీ సత్యకామేశ్వరానంద ఆశ్రమంకు చెందిన పూజ్యశ్రీ ఆనంద సరస్వతి స్వామీజీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ అయోధ్య కరసేవక సమ్మేళనానికి ప్రధాన వక్తగా హాజరైన వీహెచ్‌పీ అఖిల భారత కార్యదర్శి కె.కోటేశ్వరశర్మ ప్రసంగించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం చట్టం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా రామజన్మభూమి ప్రాంతమైన 67 ఎకరాలను కూడా మాజీ ప్రధాని పివి నర్సింహారావు ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, ఆ భూమిని కూడా చట్టపరిధిలోకి తీసుకురావాలన్నారు. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం కోసం 2018 మార్చి 18న హనుమద్ జయంతి నుంచి ఉగాది వరకు శ్రీరామ జయరామ జపాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ హిందువూ ఇష్టమైన దైవాన్ని పూజించాలన్నారు. హిందూ బంధువులు ఈ విధంగా సంకల్పించడం ద్వారా రామమందిరం నిర్మాణం పూర్తిచేసుకోగలుగుతామన్నారు. 2018 ఫిబ్రవరి 8వ తేదీ నుంచి రామమందిరం అంశంపై న్యాయస్థానం విచారణ చేయనుందన్నారు. ఈ విషయాన్ని డిసెంబర్ 5వ తేదీన అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తెగేసి చెప్పిందన్నారు. నరసాపురం ఎంపీ డాక్టర్ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ రానున్న పార్లమెంటు సమావేశాల్లో రామమందిరం అంశంపై చర్చించి నిర్మాణానికి కావాల్సిన బిల్లును తీసుకువచ్చేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. బిల్లు సంగతి పక్కన పెడితే ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ ఒక్క పిలుపునిస్తే అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం జరిగిపోతుందన్నారు. 1990-92లో కరసేవ చేసిన కరసేవకులను ఈ సందర్భంగా అయో ధ్య రాముని జ్ఞాపిక, మొక్కలను అందచేసి సత్కరించారు. బీజేపీ రాష్ట్ర సమన్వయకర్త పురిగెళ్ళ రఘురాం వందన సమర్పణ చేశారు.

గిరిజన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ఏపీలోని ఎస్సీ, ఎస్టీ, బడుగు వర్గాల నివాస ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు టీడీపీ ఈవో అనీల్ సింఘాల్ తెలిపారు. ఢిల్లీలో బుధవారం సింఘాల్ విలేఖరులతో మాట్లాడుతూ అరకు, పాడేరు, రంపచోడవరం, పార్వతీపురం ఐటీడీఏల పరిధిలో శ్రీవారి ఆలయాలు, జ్ఞాన మండపాల నిర్మాణానికి రూ.కోటి చొప్పున కేటాయించి ఆలయాల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ ఆలయాల నిర్వహణ టీటీడీ చేపడుతుందని, నిత్య పూజలు కైంకర్యాల నిమిత్తం అర్చకులను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.