ఆంధ్రప్రదేశ్‌

పోలీసులపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, జూన్ 6: కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో దళితరత్న అవార్డు గ్రహీత, మంత్రి రావెల కిషోర్‌బాబు, ఏలూరు ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు ముఖ్య అనుచరుడిగా ఉంటూ ప్రైవేటు దందాలు చేస్తున్న పాలేటి మహేశ్వరరావు, అతని అనుచరులు సోమవారం పోలీసులపై దాడికి పాల్పడ్డారు. సాక్షాత్తూ ఎస్‌ఐపై దాడి చేయబోగా అడ్డుగా వచ్చిన కానిస్టేబుళ్లపై వారు దాడులకు తెగబడ్డారు. ఈ సంఘటన ఆగిరిపల్లిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆగిరిపల్లి మండలంలోని రౌడీషీటర్ల పూర్తి సమాచారాన్ని పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. వారంరోజుల క్రితం సమాచారం ఇవ్వాలని పోలీసులు రౌడీషీటర్లకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక పెద్ద కొటాయ్ సెంటర్‌లో ఎస్‌ఐ వి రాజేంద్రప్రసాద్ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తుండగా రౌడీషీటర్లుగా ఉన్న పాలేటి శ్రావణ్‌కుమార్, రొంపిచర్ల దాసు మోటారు బైక్‌పై వెళుతూ ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌తో వేళాకోళమాడారు. ‘మీ సమాచారం కావాలని అడుగుతుంటే ఎందుకు ఇవ్వరంటూ ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ వీరిని రహదారిపై ఆపేశారు. వెంటనే ఈ విషయాన్ని శ్రావణ్‌కుమార్ తన అన్న, దళితరత్న అవార్డు గ్రహీత పాలేటి మహేశ్వరరావుకు చెప్పటంతో ఆయన అక్కడకు చేరుకుని ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌ని నానా దుర్భాషలాడాడు. ‘యూనిఫాం తీసేసి రా! నీ సంగతి తేలుస్తా.. నా ప్రతాపం చూపిస్తా.. చితక్కొట్టి పంపుతా.. ఎవరు అడ్డం వచ్చినా సరే! రా..’ అంటూ ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ మీదికి వెళ్లాడు. ఇతని అనుచరులు కూడా ఒక్కసారిగా ఎస్‌ఐపై దాడికి వచ్చారు. అక్కడే ఉన్న కానిస్టేబుళ్లు అడ్డుకున్నారు. దీంతో రౌడీషీటర్ల దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. సంఘటన నుండి పోలీసులు తేరుకునేలోపే రౌడీషీటర్లు, నిందితులు పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న డిఎస్పీ కె శ్రీనివాసరావు, నార్త్‌జోన్ ఐజి కుమార విశ్వజిత్, జిల్లా ఎస్పీ విజయకుమార్, తదితర పోలీసు అధికారులు ఆగిరిపల్లి చేరుకున్నారు. సంఘటన సమాచారం తెలుసుకున్నారు.

chitram వివరాలు తెలుసుకుంటున్న నార్త్‌జోన్ ఐజి కుమార విశ్వజిత్