ఆంధ్రప్రదేశ్‌

ప్రజల విరాళాలతో పోలవరం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 6: తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం గుర్తుందా? జల్లికట్టు క్రీడను కోర్టు నిషేధించిన సమయంలో దానిని వ్యతిరేకిస్తూ ప్రజలు ఎవరికి వారు మెరినాబీచ్ వద్దకు లక్షలాదిమంది హాజరయి దేశాన్ని విభ్రమపరిచారు. నాయకుడు లేని ఆ ఉద్యమానికి కేంద్రమే తలవంచింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు వ్యవహారం కూడా అదే దారి పట్టనుందా? అవును.. సోషల్ మీడియాలో వివిధ వర్గాల ఆగ్రహం, కేంద్ర సహాయ నిరాకరణకు ప్రత్యామ్నాయ మార్గాలు, రైతుల స్పందన చూస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికి ప్రజలే స్వచ్ఛందంగా విరాళాలిచ్చేందుకు ముందుకువచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిష్ఠాత్మకమైన పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదిలోగా పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ నెరవేరే సూచనలు కనిపించడం లేదు. 2108 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. దీన్ని రాసిపెట్టుకోండి. మీ పత్రికలో రాసుకోండని అసెంబ్లీ సాక్షిగా జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ వైసీపీ నేత జగన్‌కు చేసిన చాలెంజ్ అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. కేంద్రం వేస్తున్న కొర్రీలతో విసిగిపోతున్నట్లు ముఖ్యమంత్రి, మంత్రుల వాదన స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కావాలంటే మీకే ఇస్తాం. మీరే పూర్తి చేయండని సీఎం చంద్రబాబు దండం పెట్టే పరిస్థితి ఏర్పడింది. కొత్తగా తెరపైకి వచ్చిన టెండర్ల రద్దు, కేంద్రం రాష్ట్రానికి పంపుతున్న లెక్కల వివరాలు, కేంద్రజలవనరుల శాఖ ఇస్తున్న నోటీసులు పరిశీలిస్తే, 2019 ఎన్నికల సమయానికి సైతం పోలవరం పూర్తి కాదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో పోలవరం సహా, మిగిలిన పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రం అనుసరిస్తోన్న తాత్సార, సహాయ నిరాకరణ వ్యవహారం చివరకు ఆత్మగౌరవ పోరాటం దిశగా వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేక హోదా, ప్యాకేజీ సహా విభజన హామీలను పెండింగ్‌లో పెట్టిన కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై, ఇప్పటికే వివిధ వర్గాల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ వ్యవహారాన్ని ప్రజలు ఆత్మగౌరవ పోరాటం దిశగా తీసుకువెళ్లాలన్న కాంక్ష వారి వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో దానిపై స్పందన రాను రాను కేంద్రానికి వ్యతిరేకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఆధారపడే కంటే మన పోలవరం ప్రాజెక్టు మనమే పూర్తి చేసుకుందామన్న ఆత్మగౌరవ భావన పెరుగుతోంది. ఆ ప్రకారంగా.. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులతో పాటు, వ్యాపార, వాణిజ్య వర్గాలు ముందుకువచ్చి తమ వంతు స్వచ్ఛంద విరాళాలివ్వడం ద్వారా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుందామన్న పిలుపు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వైరల్ అవుతోంది. ఈ సందేశాలు ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరికీ చేరడంతోపాటు, ఫేస్‌బుక్‌లలో చేరుతుండటం చర్చనీయాంశమయింది. దానికి సంబంధించిన ఓ సందేశంతోపాటు, వేసిన కార్టూన్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. కాగా, పట్టిసీమతో ఇప్పటికే ఆర్థికంగా లబ్ధిపొందిన కృష్ణా డెల్టా రైతాంగంతోపాటు, పశ్చిమ గోదావరి జిల్లా రైతాంగం కూడా ఇలాంటి భావనకు స్పందించి ఎవరికి వారు ముందుకు రావడం బట్టి, కేంద్రంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. గత రెండు రోజుల నుంచి ఏలూరు ఎంపి మాగంటి బాబు కృష్ణా డెల్టా ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటిస్తోన్న సందర్భంలో, స్వయంగా రైతుల నుంచే ఇలాంటి ప్రతిపాదన రావడం విస్మయపరుస్తోంది. కేంద్రం ఇచ్చే డబ్బుల కోసం ఎదురుచూసే కంటే తామే ఎకరానికి ఇంత అని చందాలు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, కృష్ణాడెల్టాకు సకాలంలో నీళ్లిచ్చి తమ ఆదాయం పెంచిన ప్రభుత్వ రుణం తీర్చుకుంటామని, ఈ విషయాన్ని మీరు ముఖ్యమంత్రికి చెప్పండని రైతులే ముందుకు రావడం ఎంపి, ఆయనతో వచ్చిన మంత్రినీ ఆశ్చర్యపరిచింది. దానితో ఈ విషయాన్ని తాను సీఎం దృష్టికి తీసుకువెళతామని ఎంపి బాబు వారికి హామీ ఇచ్చారు. కృష్ణాడెల్టా పరిధిలో 13 లక్షల ఎకరాలున్నాయి. ప్రజల విరాళాలతో పోలవరం పూర్తి చేసుకుని కేంద్రానికి గుణపాఠం చెబుతామన్న ఆత్మగౌరవ పోరాటం క్షేత్రస్థాయికి వెళితే, కేంద్రంలోని బీజేపీ మరింత బలహీనపడటం ఖాయమని రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు,ప్రజాసంఘాలు పోలవరంపై కేంద్ర సహాయ నిరాకరణకు సంబంధించి ప్రత్యేక చర్చలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లకు రూ. 1000 కోట్ల రుణం

విజయవాడ, డిసెంబర్ 6: రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు వీలుగా 1000 కోట్ల రూపాయలను విజయా బ్యాంక్ నుంచి రుణంగా తీసుకునేందుకు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థకు బుధవారం ప్రభుత్వం అనుమతిచ్చింది. వివిధ ప్రాజెక్టుల కోసం 3000 కోట్ల రూపాయల మేర నిధులు కావాలని ఆ సంస్థ ప్రతిపాదనలు పంపింది. ఇందులో భాగంగా 1000 కోట్ల రూపాయల మేరకు అనుమతి ఇచ్చింది.