ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచ బ్యాంక్ రుణానికి ప్రభుత్వం ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 6: రాష్ట్రంలో నిరంతరాయంగా అందరికీ విద్యుత్ ప్రాజెక్టు కింద ప్రపంచ బ్యాంక్ నుంచి వివిధ విద్యుత్ సంస్థలు 240 మిలియన్ డాలర్ల మేర రుణాన్ని తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందరికీ విద్యుత్ కింద ప్రపంచ బ్యాంక్ 240 మిలియన్ డాలర్లను, మరో 160 మిలియన్ డాలర్లను ఎఐఐబి అందచేసేందుకు వీలుగా కేంద్రం ఒప్పందం చేసుకుంది. ఆ మేరకు ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం తీసుకునేందుకు ఏపీట్రాన్స్‌కో, ఏపీఈపీడీసీఎల్, ఎపీఎస్‌పీడీసీఎల్‌లను అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు బుధవారం జారీ చేసంది. ఆర్థిక శాఖ ఆమోదించడంతో ఈ రుణాలను తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రూ.21,968 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు

విజయవాడ, డిసెంబర్ 6: రాష్ట్రంలో మంచినీటి సరఫరాను మెరుగుపరిచేందుకు 21,968 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో ఆయన బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిదశలో 10 వేల కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాలన్నారు. వీలైనంత త్వరగా ఈ కార్పొరేషన్ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఎన్టీఆర్ సుజల ప్లాంట్ల ఏర్పాటు అనుకున్నంత వేగంగా జరగడం లేదని, పనితీరు మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జలవాణి, సోషల్ మీడియా ద్వారా వస్తున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం అనుసంధానంపై జరిగిన సమీక్షలో 6300 డంపింగ్ యార్డులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 3534 కేంద్రాలు పూర్తి అయ్యాయని, మిగిలిన వాటిని త్వరగా నిర్మించాలని ఆదేశించారు. ఎన్టీఆర్ జలసిరిపై జరిగిన సమీక్షలో ఈ పథకం కింద 35 వేల బోర్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నిర్ణీత లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా నిధులు కేటాయిస్తామని, సోలార్ పంపు సెట్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఎల్‌ఇడి బల్బుల ఏర్పాటుపై జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో 30 లక్షలకు పైగా ఎల్‌ఇడి బల్బులను అమర్చాలని, పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బల్బుల ఏర్పాటుకు అవసరమైన మూడో వైరు ఏర్పాటుపై విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. 2019 అక్టోబర్ 2 నాటికి రాష్ట్రాన్ని బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా చేయాలన్న లక్ష్యంతో 3,168 కోట్ల రూపాయలతో 21.12 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఇందుకు అందరూ సహకరించాలన్నారు.
జనవరి 16 నుంచి సూర్యలంక వద్ద మిలటరీ శిక్షణ

విజయవాడ, డిసెంబర్ 6: భారత మిలటరీ శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంక వద్ద సాయుధ దళానికి (నేవీ) శిక్షణ ఇవ్వనున్నారు. జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు 15 రోజులపాటు జరిగే శిక్షణా కార్యక్రమాలకు రాష్ట ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ విషయమై రాష్ట్ర పొలిటికల్ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఓ ప్రకటనలో తెలిపారు.