ఆంధ్రప్రదేశ్‌

బోయలకు దేవుడు చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 6: రాష్ట్రంలో వాల్మీకి, బోయల స్థితిగతులను అర్థం చేసుకుని వారిని ఎస్టీల జాబితాలో చేర్చాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బోయల దేవుడని వాల్మీకి, బోయ ఫెడరేషన్ చైర్మన్ బీటీ నాయుడు అన్నారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో బుధవారం మధ్యాహ్నం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాజ్యాంగ పరంగా, ప్రభుత్వపరంగా అందవలసిన పథకాలు, విద్య, ఉపాధి అవకాశాలు అందక అనేక బాధలు పడుతూ 61 ఏళ్లుగా పోరాటం చేస్తున్న వాల్మీకులకు, బోయలకు సీఎం న్యాయం చేయదలుచుకున్నారని, అందుకు తమకు సంతోషంగా ఉందని అన్నారు. 1956లో రాష్ట్రంలోని వాల్మీకి, బోయలను కుట్రపూరితంగా మూడు ముక్కలుగా చేశారని పేర్కొన్నారు. బ్రిటీష్ వారి పాలనలో ఎరుకలు, యానాది, లంబాడీలను క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ కింద పోలీస్ స్టేషన్లలో పెట్టడం, జైళ్లకు పంపడం చేసేవారని, అంతేకాకుండా వారిపై నేరస్తులుగా ముద్రవేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పాదయాత్ర సందర్భంగా తమ పరిస్థితులను తెలుసుకుని తమ సమస్యను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత గవర్నర్ ప్రసంగంలో చేర్చారని, ఎస్టీ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కారెం శివాజీ నాయకత్వంలో బహిరంగ విచారణ జరిపించారని వివరించారు. ఆ తరువాత 10 మంది మేధావులతో సత్యపాల్ కమిటీనీ ఏర్పాటు చేసి బోయల స్థితిగతులను అధ్యయనం చేయించి, వారిని ఎస్టీల జాబితాలో చేర్చాలని కేంద్రానికి సిఫారసు చేస్తూ మంత్రి మండలిలో తీర్మానం చేయించి, ఆ మరుసటి రోజునే శాసనసభలో ఆమోదింపచేసిన చంద్రబాబు బోయలకు దేవుడులాంటి వారన్నారు. అటువంటి నేత చంద్రబాబుకు వచ్చే ఏడాది మార్చిలో లక్ష మంది బోయల సమక్షంలో సన్మానం చేస్తామని ఆయన చెప్పారు.

మోడల్ టీచర్ల సమస్యలపై నేడు విద్యాశాఖ కమిషనర్‌తో భేటీ

విజయవాడ, డిసెంబర్ 6: మోడల్ స్కూళ్లను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని టీచర్లకు 010 పద్దు కింద జీతాలు చెల్లించాలని కోరుతూ శుక్రవారం మోడల్ టీచర్లు తలపెట్టిన చలో సెక్రటేరియట్ నేపథ్యంలో విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి మోడల్ స్కూళ్ల టీచర్ల అసోసియేషన్ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించారు. విజయవాడలోని ఒక హోటల్‌లో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ఉంటుందని, మోడల్ స్కూళ్ల ప్రతినిథులందరూ పాల్గొని తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లే విధంగా చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో మోడల్ స్కూళ్ల సమస్యల మీద ప్రధానంగా చర్చినున్నట్లు మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోమటిరెడ్డి, శివశంకర్ రెడ్డి, జి.చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు.