ఆంధ్రప్రదేశ్‌

అవినీతి రహితంగా మోదీ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూన్ 6: పదేళ్లపాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని అవినీతిలో ముంచెత్తిందని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. సోమవారం అనంతపురం నగరంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల్లో కూరుకుపోయిందన్నారు. 2జి, బొగ్గు, స్పెక్ట్రమ్, భూగర్భజలాలు, విమానయానరంగం, పంచభూతాలను సైతం వదలకుండా కాంగ్రెస్ మంత్రులు వేల కోట్ల దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికీ ఆ కేసులు వారిని వెంటాడుతున్నాయన్నారు.
కాంగ్రెస్ అంటేనే అవినీతి అనేలా కుంభకోణాలు చేశారన్నారు. కాంగ్రెస్ అవినీతిని అసహ్యించుకునే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు పూర్తిగా తుదిచిపెట్టిచారన్నారు. భారతీయ జనతాపార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దేశప్రధానిగా నరేంద్రమోదీ అధికార పగ్గాలు చేపట్టి నీతివంతమైన పాలనకు శ్రీకారం చుట్టారన్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ పేర ఆ పార్టీ హయాంలో జరిగిన అవినీతిని కూకటివేళ్లతో పెకిలిస్తున్నారని, అన్ని శాఖలను పక్షాళన చేసుకుంటూ పారదర్శక పాలన అందిస్తున్నారన్నారు. నేడు దేశంలో ఎక్కడా బొగ్గుగనులు టెండర్లు లేకుండా కేటాయించడం లేదన్నారు. పారదర్శకంగా టెండర్ల ద్వారానే గనులు కేటాయిస్తున్నామన్నారు. అదేవిధంగా ఏ ప్రభుత్వశాఖలో అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన సాగుతోందన్నారు. ఇదంతా ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన చర్యల్లో భాగమేననన్నారు. దేశాన్ని అవినీతిరహితంగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అన్నారు. నరేంద్రమోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆయా రాష్ట్రాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, బిజెపి ఆధ్వర్యంలో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా, చట్టపరంగా ఇబ్బందులు కలుగుతున్నా వాటినన్నింటినీ పక్కనబెట్టి అనుమతులు త్వరితగతిన ఇచ్చామన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి అందాల్సిన అన్ని నిధులు అందుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, రాజమంత్రి సిటీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

chitram విలేఖరులతో మాట్లాడుతున్న కేంద్రమంత్రి జవదేకర్