శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

షార్‌లో భద్రత కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 19: శ్రీహరికోటలోని షార్‌లో బుధవారం పిఎస్‌ఎల్‌వి-సి 31 రాకెట్ ప్రయోగం దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. షార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సిఐఎస్‌ఎఫ్ బలగలాలు, సముద్ర మార్గాన కోస్టల్ గార్డ్సుచే జల్లెడ పట్టి గాలిస్తున్నారు. షార్ మొదటి గేటు వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపుతున్నారు. సూళ్లూరుపేట శ్రీహరికోట మార్గమధ్యలో అటకానితిప్ప వద్ద సిఐఎస్‌ఎఫ్ అవుట్ చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. బుధవారం ఉదయం 9:31 గంటలకు రాకెట్ నింగిలోకి ఎగరనుంది. షార్ నుండి ఈ ఏడాది తొలిప్రయోగం కావడంతో విజయవంతం చేసేందుకు శాస్తవ్రేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ వ్యవస్థకు సంబంధించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఇ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 1979లో ఎస్‌ఎల్‌వి వంటి రాకెట్ల ద్వారా చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు శ్రీకారం చుట్టింది. అనంతరం ఎఎస్‌ఎల్‌వి వాహక నౌక ద్వారా 1987లో 150 కిలోల బరువు కలిగిన సామర్ధ్యాన్ని పంపగలిగింది. అనంతరం పిఎఎస్‌ఎల్‌వి రాకెట్ల ద్వారా తొలిసారి 1993 సెప్టెంబర్ 20న 846 కిలోల బరువుగల ఐఆర్‌ఎస్-1ఇ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 2001లో జిఎస్‌ఎల్‌వి వంటి భారీ ప్రయోగాలకు ఇస్రో శ్రీకారం చుట్టి చంద్రమండలంపై పరిశోధన చేసే స్థాయికి ఎదిగి ప్రపంచ దేశాల సరసన చేరింది. ఇవే కాకుండా మానవ సహిత రాకెట్ ప్రయోగాలకు కూడా సన్నద్ధమవుతోంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ఇప్పటివరకు మొత్తం 50 ప్రయోగాలు జరిగాయి. ఎక్స్‌పర్‌మెంటల్ వంటి పునఃప్రవేశ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించారు. బుధవారం శ్రీహరికోట నుండి నింగిలోకి పంపే పిఎస్‌ఎల్‌వి-సి 31 ప్రయోగం 51వది కాగా పిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో 33వ ప్రయోగం కావడం విశేషం. మొదట ఎస్‌ఎల్‌వి వంటి చిన్న రాకెట్ ప్రయోగాలతో ప్రారంభించి నేడు భారీ ప్రయోగాలకు ఇస్రో ఎదిగింది. ఇప్పటివరకు షార్ నుండి ఎస్‌ఎల్‌వి-4, ఎఎస్‌ఎల్‌వి-4, పిఎస్‌ఎల్‌వి- 32, జిఎస్‌ఎల్‌వి-9 ఒక ఎక్స్‌ఫర్‌మెంటల్ ప్రయోగాలతో కలిపి మొత్తం 50 రాకెట్లను నింగిలోకి పంపింది. ఇందులో 41 విజయంతం కాగా కేవలం 9 ప్రయోగాలు మాత్రమే వైఫల్యం చెందాయి. ఇందులో పిఎస్‌ఎల్‌వి రాకెట్ ప్రయోగాలైతే మొదటిది మినహాయిస్తే 31 ప్రయోగాలు వరుసగా విజయపరంపర మోగించాయి. 51వ ప్రయోగాన్ని కూడా విజయవంతం చేసేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు. గతంలో విదేశీ ఉపగ్రహాలపై ఆధారపడే ఇస్రో ప్రస్తుతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి ఉపగ్రహాలను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెడుతున్నారు. చంద్రయాన్ విజయవంతమే కాకుండా జిఎస్‌ఎల్‌వి వంటి భారీ ప్రయోగాలకు సైతం స్వదేశీ క్రయోజనిక్ ఉపయోగించి విజయం సాధించారు.

రెవెన్యూ సమస్యలను పరిష్కరించండి
తహశీల్దార్లకు సబ్ కలెక్టర్ ఆదేశం
గూడూరు, జనవరి 19: గూడూరు డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని గూడూరు సబ్ కలెక్టర్ గిరీషా మండల తహశీల్దార్‌లను ఆదేశించారు. మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని 9 మండలాల తహశీల్దార్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21న జిల్లా పర్యటనకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, రెవెన్యూ శాఖ మంత్రి రానున్న దృష్ట్యా డివిజన్ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ సమస్యలను సత్వరం పరిష్కరించాలని కోరారు. ప్రధానంగా వెబ్ కౌనె్సలింగ్, మీసేవ, సివిల్ సప్లై, వరద సహాయక చర్యల గురించి తీసుకున్న వివరాలను ఆయన తహశీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల సంభవించిన వరదలతో నష్టపోయిన బాధితులకు అందిన సహాయం గురించి ఆయన తహశీల్దార్లను అడిగి తెలుసుకున్నారు.

మళ్లీ కంపించిన భూమి
జనం పరుగో.. పరుగో
వింజమూరు, జనవరి 19: మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఉదయం తొమ్మిది, పది గంటల నడుమ కొద్ది సెకన్లపాటు భూమి కంపించడంతో స్థానిక ప్రజానీకం పరుగులు తీశారు. భూమి కంపించిన గ్రామాల్లో చాకలికొండ, తక్కెళ్లపాడు, జనార్ధనపురం, గోళ్లవారిపల్లి, బత్తినవారిపల్లి ఉన్నాయి. చాకలికొండ గ్రామానికి చెందిన బసవయ్య విలేఖర్లతో మాట్లాడుతూ గత మూడు మాసాలుగా ఆరేడు పర్యాయాలుగా భూమి కంపించిందన్నాడు. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోనే ఇలా ఎందుకు జరుగుతుందని స్థానిక ప్రజానీకం వాపోతున్నారు. ఎక్కువమార్లు పగలే భూమి కంపిస్తున్నట్లు తెలిపారు. పలువురు అనుభవం కలిగిన రైతులు మాట్లాడుతూ స్థానికంగా ఎక్కువగా చీనీ, బత్తాయి, నిమ్మతోటలు సాగు చేస్తున్నారన్నారు. ఇటీవల కాలంలో వర్షాలు కురవకపోవడంతో చెట్లను కాపాడేందుకు భూగర్భజలాల కోసం పెద్దసంఖ్యలో బోరు పాయింట్లను మూడు వందల అడుగుల వరకు కూడా తవ్వారన్నారు. వాటిలో అతి తక్కువ సంఖ్యలో మాత్రమే నీటి జాడ కనిపించిందన్నారు. మిగిలిన అన్ని పాయింట్లలోనూ ఖాళీ రంధ్రాలుగానే మిగిలిపోయి అవి తరచూ కుదింపులుగా చోటుచేసుకుంటున్న తరుణంలో ఇలా ప్రకంపనలు చోటుచేసుకుంటున్నట్లుగా అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.
దుత్తలూరులో..
దుత్తలూరు: మండలంలోని పలు గ్రామాల్లో భూమి కంపించింది. మంగళవారం ఉదయం 9.10 గంటల సమయంలో నాలుగు సెకన్లపాటు భూమి కంపించడంతో జనం ఒక్కసారిగా భీతిల్లారు. ఏమవుతుందోనని ఆందోళన చెందుతూ ఒక్కసారిగా అటూ ఇటు పరుగులు తీశారు. మండలంలోని తురకపల్లి, జంగాలపల్లి, భైరవరం, ముత్తరాశిపల్లిలో భూమి కంపించినట్లుగా చెబుతున్నారు.
వరికుంటపాడులో..
వరికుంటపాడు: మండల పరిధిలోని పలు గ్రామాలలో మంగళవారం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తూర్పుచెన్నంపల్లి, తూర్పుబోయమడుగుల, జడదేవి, కరియంపాడు గ్రామాలలో ఉదయం 9.30 నిమిషాలకు రెండు సెకన్లపాటు భూప్రకంపనలు వచ్చాయి. ఈనెలలో ఈభూప్రకంపనలు రావడం ఐదోసారి. భూమి నుంచి వింత శబ్దాలు రావడంతో పాటు ఇళ్లల్లోని వస్తువులు కదలడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వీధుల్లోకి పరుగులు తీశారు. గత ఏడాది, ఈ ఏడాది కలిపి మొత్తం తొమ్మిదిసార్లు భూప్రకంపనలు వచ్చాయి. ఇన్నిసార్లు భూప్రకంపనలు వస్తున్నప్పటికీ అధికారులు మండలం వైపు కనె్నత్తి చూడలేదని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నామని అంటున్నారు. ఎప్పుడు ఏ విపత్తు జరుగుతుందోనని కంటికి నిద్రలేకుండా వుంటున్నారమని పలువురు ప్రజలు అంటున్నారు. భూమి నుంచి ఇలాంటి శబ్దాలు రావడం ఎప్పుడూ వినలేదని వృద్ధులు ఆవేదనతో అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మండలంలో పర్యటించి భూగర్భంలో ఏమి జరుగుతుందో తేల్చాలని ప్రజలు కోరుతున్నారు.

‘కల్తీ మంచినీటి వ్యాపారాన్ని అరికట్టాలి’
నెల్లూరు టౌన్, జనవరి 19: జిల్లాలో కల్తీ తాగునీటి వ్యాపారాన్ని అరికట్టాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ప్రస్తుతం మినరల్ వాటర్ పేరుతో బోరు నీటిని అమ్ముతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలో గాంధీబొమ్మ కూడలిలో తాగునీటి కల్తీ వ్యాపారాన్ని అరికట్టాలని గాంధీ విగ్రహానికి బిజెపి నాయకులు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సురేష్‌రెడ్డి మాట్లాడుతూ మినరల్ వాటర్ పేరుతో బోరు నీటినే క్యాన్‌లలో ఉంచి కొంత మంది వాటర్‌ప్లాంటు యజమానులు అమ్ముతు, ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారన్నారు. అనేకసార్లు జిల్లా ఉన్నతాధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న కల్తీ వ్యాపారులను కఠినంగా శిక్షించాలని కోరినా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు ఉండడం దారుణమన్నారు. జిల్లా అధికారులను ఈ విషయాలపై కలిస్తే దీని గురించి తమకు సంబంధం లేదంటూ తప్పించుకోవడం చూస్తుంటే వీరికి నెల మామూళ్లు ఎంతముట్టుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. నగరంలో నీటిశుద్ధి కర్మాగారాలు నాలుగు ఉన్నా ఏనాడు అధికారులు తనిఖీ చేసిన పాపాన పోలేదన్నారు. జిల్లావ్యాప్తంగా ఐదు వందలకు పైగా మంచినీటి ప్లాంట్లు ఉంటే ఎక్కడ కూడా ఐఎస్‌ఐ మార్కుకు ఉన్న ఒక్క ప్లాంటు కూడా లేదన్నారు. ఇవి ఇలాగే కొనసాగితే ప్రజలు పలు రకాల అనారోగ్యాలకు గురవుతారని, వెంటనే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ అధికారులు, హెల్త్ అధికారులు సమావేశాన్ని ఏర్పాటుచేసి వాటిపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు తొలగిస్తాం
కలెక్టర్ జానకి వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, జనవరి 19: ప్రభుత్వ స్థలాల్లో పేదల ఆక్రమణలను తొలగించి వారికి పునరావసం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జానకి తెలిపారు. నగరంలోని బోడిగాడితోటలోని ఆక్రమణలు, పడుగుపాడు రైల్వేలైన్ నుండి వేదాయపాళెం రైల్వేలైను వరకు రైల్వేలైన్ పరిధిలో ఏర్పాటు చేసుకున్న ఆక్రమణలను ట్రాలీ ద్వారా రైల్వే అధికారుల సమన్వయంతో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా తొలుత బోడిగాడితోట పక్కనే ఉన్న మైపాడురోడ్డు వద్ద నిర్మించిన ఆక్రమణలను పరిశీలించారు. ఈసందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఈ స్థలంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, నివాసం లేక కూలిపనులు, చెత్త ఏరుకుంటూ దుర్భరమైన జీవనం సాగిస్తున్నామని కలెక్టర్‌కు సమస్యలు తెలియచేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వెంటనే పునరావాసం ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వానికి సహకరించి ఆక్రమణలు ఖాళీ చేయాలని వారికి తెలియజేశారు. బోడిగాడితోట సమీపంలో ఉన్న మైపాడురోడ్డు మీద ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. బోడిగాడితోటలో నివాసం ఉన్న పేదలకు రేషన్ కార్డులు, పింఛన్లు తదితర ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలందరిని బడికి పంపి చదివించాలని వారికి సూచించారు. పడుగుపాడు రైల్వేస్టేషన్ సమీపం నుండి రైల్వేట్రాక్‌పై రైల్వేట్రాలి ద్వారా రైల్వే లైను ల్యాండ్ పరిధిలో ఏర్పాటు చేసుకున్న భక్తవత్సలనగర్ రైల్వేగేటు వరకు ఉన్న ఆక్రమణలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బంగ్లాలో ఆక్రమణలకు సంబంధించిన అంశాల గురించి రైల్వే అధికారులు, రెవిన్యూ అధికారుల సమన్వయంతో సమీక్షించి పలు సూచనలిచ్చారు. అనంతరం నెల్లూరు పరిధిలోని రైల్వేలైను భూముల పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు రెవెన్యూ అధికారుల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రతి కుటుంబం వివరాలు తీసుకుని సంబంధిత నివేదిక పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డివిజనల్ మేనేజర్ శైలేష్, నెల్లూరు ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ పివివిఎస్ మూర్తి, రైల్వే ట్రాక్ అధికారి పి వేణు, నెల్లూరు తహశీల్దార్ జనార్థన్ తదితరులు పాల్గొన్నారు.

భూముల సర్వేలో జాగ్రత్తలు తీసుకోవాలి
సర్వేయర్లకు జెసి ఇంతియాజ్ ఆదేశం
నెల్లూరుసిటీ, జనవరి 19: నెల్లూరు జిల్లా పారిశ్రామికపరంగా ఎంతో అభివృద్ది చెందుతున్నందున సర్వేయర్లు తమకు కేటాయించిన పనులను నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. మంగళవారం గోల్డెన్ జూబ్లీ హాలులో జిల్లా వ్యాప్తంగా ఉన్న భూమి సర్వేయర్లతో ప్రగతి గురించి సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో నేషనల్ హైవే రోడ్డు పనులు, రైలు లైను నిర్మాణ పనులు విరివిరిగా చేపట్టన్నందున వీటిపై జాగ్రత్త వహించి ఎప్పటికప్పుడు సర్వేలను పూర్తిచేయాలని తెలిపారు. భూసేకరణకు సంబంధించిన సర్వేలు గాని, ప్రభుత్వ భూములకు సంబంధించి సర్వేలు గాని అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుని ఉన్నాయన్నారు. ప్రతి వారం ఉన్నతాధికారులు ఈ అంశంపై కనీసం ఒక అరగంట జిల్లా గురించి సమీక్షిస్తున్నారని చెప్పారు. కొన్ని ప్రాంతాలలో సర్వేయర్లు ఇతర జిల్లాలతో పోలిస్తే ముందుస్తు భాగంలో ఉన్నారని చెప్పారు. మరికొన్ని అంశాలలో వెనుకబడి ఉన్నాయని తెలిపారు. జిల్లాలో భూసర్వేల కోసం కొత్తగా ఇచ్చిన ఇటిఎస్ మిషన్లు ఉపయోగించి త్వరితగతిన సర్వేలు పూర్తిచేయాలన్నారు. ఏ ఒక్క మండలంలో కూడా సర్వేలు పెండింగ్‌లో ఉండరాదని చెప్పారు. లాండ్ అండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ బి సురేంద్ర మాట్లాడుతూ ఇప్పటివరకు సర్వే నిర్వహించడానికి 22 ఇడిఎస్ మిషన్లు వచ్చాయని వాటిని సర్వేయర్లు వాడుతున్నారన్నారు. అదేవిధంగా జిల్లాకి కొత్తగా 10 ఇటిఎస్ పరికరాలు వచ్చాయని ఆయన తెలుపుతూ వాటి శిక్షణ కోసం జిల్లా నుండి నలుగురు సర్వేయర్లను ప్రతినెల శిక్షణ కోసం పంపనున్నట్లు తెలియచేశారు. ఈ సమావేశంలో పలువులు సర్వేయర్లు పాల్గొన్నారు.

‘ఇంటి పన్ను పెంపు తగదు’
బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 19:ఇంటి పన్నును పెంచడం తగదని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. ఆ పార్టీకి చెందిన బుచ్చిరెడ్డిపాళెం గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు రామిశెట్టి కళ్యాణ్‌కుమార్, ఆలూరు శేషసాయి ఇంటి పన్నును పెంచడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం మండల పరిషత్ సూపరిటెండెంట్ డి నరసింహారావుకు ఓ వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామ పంచాయతీ ప్రజల ఇంటి పన్నును పెంచాలంటే గ్రామసభ, గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశం నిర్వహించి వార్డు సభ్యుల ఆమోదం పొందిన తర్వాత ఆ కాపీని కలెక్టర్, డిపిఓకు పంపించాల్సి ఉందన్నారు. అనంతరం వారి అనుమతితో ప్రతి సంవత్సరం పెంచే 5 శాతం పన్ను కాకుండా పంచాయతీ ఇబ్బందులలో ఉన్నప్పుడు కేవలం 5 శాతం మాత్రమే పెంచాలన్నారు. అయితే ఎలాంటి అనుమతులు పొందకుండా ఏకంగా 30 శాతం పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వీధిలైట్లు, మురుగు కాలువలపై పన్నులను వేసి ప్రాంతాలవారీగా ఇంటి పన్ను డిమాండ్ నోటీసులను పంపిణీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధానకార్యదర్శి కాసా శ్రీనివాసులు, బిజెవైఎం మండల ప్రధానకార్యదర్శి కోనం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారం కోసం రైల్వే ఉద్యోగుల ధర్నా
వెంకటగిరి, జనవరి 19: రైల్వే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ మంగళవారం స్థానిక రైల్వేస్టేషన్ ఎదుట సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య పిలుపు మేరకు ఈ ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ బ్రాంచి జనరల్ సెక్రటరీ భక్తవత్సలయ్య మాట్లాడుతూ ఏడవ వేతన సంఘం నిర్లక్షపూరిత వైఖరిని నిరసిస్తూ ధర్నా నిర్వహించామన్నారు. రైల్వే ప్రైవేటీకరణ నిలిపివేయాలని, కార్మికులకు నష్ణపరిచే చట్టాలను చేయరాదని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం డివిజన్ కార్యాలయం గుంతకల్లులో కూడా ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అసిస్టెంట్ సెక్రటరీ ఆర్‌బి కన్నా, వైస్ చైర్మన్ బి చలపతి, ట్రెజరర్ శ్రీనివాసులు, పలువురు రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు.