ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్భ్రావృద్ధిలో రాజీలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 7: అప్పు చేసైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. కష్టాలను ఎదుర్కొంటూ బాధ్యతలను మరవకుండా రాష్ట్భ్రావృద్ధికి దృఢసంకల్పంతో పనిచేస్తున్నామన్నారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలోని వైవిఆర్ మూర్తి ఆడిటోరియంలో మంగళవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు 49 వేల కోట్ల రూపాయలను సంక్షేమానికి కేటాయించామని గుర్తు చేశారు. ఆదాయం తక్కువ, సంక్షేమానికి, ఇతర అవసరాలకు ఖర్చులు ఎక్కువ ఉన్నా సంక్షేమానికి ప్రాధా న్యం ఇస్తున్నామన్నారు. విభజనకు ముందు అభివృద్ధిలో మొదటి ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా ఉండగా, విభజన తరువాత 15కు దిగజారిందన్నారు. పేదరికం, ఆర్థిక అసమానలు అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల భాగస్వాములు కావాలని కోరారు. తలసరి ఆదాయంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉందని, అర్థిక అసమానతలు ఉన్నాయన్నారు. ఆర్థిక వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హ్యాపినెస్ ఇండెక్స్ 15గా ఉందన్నారు. ఈ ఇండెక్స్‌ను మెరుగుపరుచుకోవడంతో విద్య, వైద్యం వంటివి కీలమన్నారు. లోపాలను గుర్తించడం వల్ల వాటిపై దృష్టి కేంద్రీకరించేందుకు వీలు కలుగుతుందన్నారు. సామాన్యులను కూడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో 16 వేల కోట్ల రూపాయలు, ఈ ఏడాది 24 వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకువచ్చామని తెలిపారు. గడచిన రెండేళ్లలో అన్ని వర్గాల వారికి ప్రభుత్వం సాయం అందించిందన్నారు.