ఆంధ్రప్రదేశ్‌

నేటి నుండి భవానీదీక్షల విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) డిసెంబర్ 9: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ఆదిపరాశక్తి, శ్రీ కనక దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం ఉదయం నుండి అమ్మవారి భవానీదీక్షల విరమణ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీక్షల విరమణకు సంబంధించి సుమారు 10కోట్ల రూపాయల వ్యయంతో భవానీలు, భక్తులకు కావాల్సిన సకల ఏర్పాట్లలను దేవస్ధానం ఇవో ఎ సూర్యకుమారి ఆధ్వర్యంలో ఇప్పటికే పూర్తి చేశారు. ఆదివారం ఉదయం సుమారు 7గంటల నుండి భవానీలు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం నుండి వేకువ జామున 3గంటల నుండి రాత్రి 10గంటల వరకు భవానీలు, భక్తులు అమ్మవారిని దర్శించుకోనే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. భవానీదీక్షల విరమణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖలకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది, తదితరులు శనివారం సాయంత్రం నుండే దేవస్ధానం అధికారులకు రిపోర్ట్ చేసి విధులకు హాజరయ్యారు. ఐదు రోజులు జరిగే భవానీదీక్షల విరమణ కార్యక్రమానికి 6లక్షల మంది భవానీలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చే అవకాశం ఉందని దేవస్ధానం అధికారులు అంచనా వేస్తున్నారు. భవానీలకు అవసరమైన అన్ని వౌలిక సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారు.

చిత్రం..దీక్షల విరమణకు తరలివస్తున్న భవానీలు