ఆంధ్రప్రదేశ్‌

1 నుంచి పుస్తక పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: ఎన్‌టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతికశాఖ సంయుక్త నిర్వహణలో జనవరి 1 నుంచి 11 వరకు విజయవాడలోని స్వరాజ్ మైదాన్‌లో నవ్యాంధ్ర పుస్తక సంబరాలు జరుగబోతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటైన విలేఖరుల సమావేశంలో ఎన్‌టీఆర్ ట్రస్ట్ సీఈఓ టి.విష్ణువర్థన్ మాట్లాడుతూ పుస్తక పఠనం, సాహిత్యం, సాహిత్య విమర్శ ద్వారా ఆంధ్రప్రదేశ్ విజ్ఞానవంతమైన సమాజం అవుతుందన్నారు. ట్రస్ట్ ద్వారా విజయవాడతోపాటు అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి నవ్యాంధ్ర పుస్తక సంబరాలు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి వారికి ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. విట్, ఎస్‌ఆర్‌ఎం, కెఎల్‌యు విద్యాసంస్థల సహకారంతో నిపుణులతో సమాలోచన అనే చర్చా గోష్టి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. పుస్తక సంబరాల సలహాదారులు, రాష్ట్ర ప్రణాళికా సంఘ సభ్యులు డాక్టర్ పెద్ది రామారావు మాట్లాడుతూ నవ్యాంధ్ర పుస్తక సంబరాలను ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారన్నారు. ఎమెస్కో ప్రచురణల సంస్థ అధినేత విజయకుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను విజ్ఞాన సమాజంగా అభివృద్ధి చేసేందుకు నవ్యాంధ్ర పుస్తక సంబరాలు నిర్వహిస్తున్నామని, విలేఖరుల సమావేశంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ (వీబీఎఫ్‌ఎస్) సెక్రటరీ లక్ష్మయ్య, గౌరవాధ్యక్షులు అశోక్, ప్రచురణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.