ఆంధ్రప్రదేశ్‌

కువైట్‌లో మంత్రి పితానికి ప్రవాసాంధ్ర తెలుగుదేశం సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 12: విదేశీ పర్యటనలో భాగంగా కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ రెండు రోజులు కువైట్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం మంత్రి పితానికి కువైట్‌లో ప్రవాసాంధ్ర తెలుగుదేశం ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. డిసెంబర్ 9న మంత్రి పుట్టినరోజు కావటంతో మంత్రితో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి ఇక్కడకు వచ్చి జీవనం సాగిస్తున్న తెలుగువారిని కలుసుకోవటం సంతోషంగా ఉందని, కువైట్ దేశ ఆర్థిక అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావటం ఆనందకరమన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది విదేశాల్లో ఆర్థికంగా స్థిరపడ్డారని చెబుతూ వారందరూ కూడా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరపున కృషి చేస్తానన్నారు. ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ బృందం వీలైనంత త్వరలో కువైట్‌లో పర్యటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న బీమా సౌకర్యాన్ని ఏపీ ఎన్నార్టీలో సభ్యులుగా చేరి వాటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తెలిపారు. ప్రవాసాంధ్ర తెలుగుదేశం అధ్యక్షుడు సుబ్బారాయుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకట్ కోడూరి, సురేష్, ఉదయ్‌ప్రకాష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.