ఆంధ్రప్రదేశ్‌

చనిపోయిన డీఎస్పీకి బదిలీ పోస్టింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 12: చనిపోయినా.. విధులు నిర్వహించ వచ్చు.. అదేలా సాధ్యమంటే పోలీసుశాఖనే అడగాలి. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజం. ఎందుకంటే ఏడాది క్రితం మరణించిన అధికారి ఇంకా బతికే ఉన్నట్లు, పోలీసుశాఖలో పని చేస్తున్నట్లు భ్రమలో ఉన్న ఉన్నతాధికారులు ఏకంగా బదిలీ పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత నాలుక కరుచుకుని సవరణ ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో తాజాగా 16మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెల్లారేసరికి జాబితాలోని 14వ నెంబర్‌లో ఉన్న డీఎస్పీ ప్రస్తుతం బతికి లేడని తెలుసుకుని సాంకేతిక తప్పిదం జరిగిందంటూ డీజీపీ కార్యాలయం నుంచి మరో సవరణ ఆదేశం జారీ అయింది. అయితే పోలీసుశాఖకు తలవంపులు తెచ్చిన ఈ వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్న డీజీపీ సాంబశివరావు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. తిరుమల స్పెషల్ బ్రాంచిలో డీఎస్పీగా ఉన్న డి రామాంజనేయులు ఏడాది క్రితం ఆనారోగ్యంతో మరణించారు. పలువురు ఉన్నతాధికారులు సైతం వెళ్లి నివాళి అర్పించారు కూడా. కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తపరిచి పోలీసుశాఖకు ఆయన చేసిన సేవలు కొనియాడారు. అయితే ఉన్నట్లుండి తాజా బదిలీల్లో రామాంజనేయులు పేరు ఉండటం విస్మయాన్ని కలుగ చేసింది. ఆయన్ను మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తం 16మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ సోమవారం రాత్రి జారీ అయిన ఆదేశాల్లో పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాల్లో పలు విభాగాల్లో పని చేస్తున్న వారిని బదిలీ చేశారు. అయితే జాబితాలో 14వ నెంబర్‌లో చనిపోయిన డి రామాంజనేయులు ఉన్నారు. తిరుమల నుంచి డీజీపీ కార్యాలయానికి బదిలీ చేస్తూ డీజీపీ సంతకంతో ఆదేశాలు వెలువడ్డాయి. సదరు అధికారి వెంటనే నిర్ణీత కార్యాలయంలో రిపోర్టు చేయాలని చిత్తూరు ఎస్పీ కార్యాలయానికి, మృతుని కుటుంబ సభ్యులకు ఆదేశాలు అందాయి. ఇదేంటి చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చి డ్యూటీలో చేరడమేంటని వారంతా విస్మయం చెందారు. దీంతో అధికారులు విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకువచ్చారు. కింది స్థాయి అధికారులు తప్పిదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీపీ విచారణకు ఆదేశించారు.