ఆంధ్రప్రదేశ్‌

గణిత పోటీల్లో తెలుగు విద్యార్థుల జయకేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, డిసెంబర్ 12: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన రామానుజన్ గణిత అకాడమి ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి గణిత పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఫలితాలను మంగళవారం అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు కెవివి సత్యనారాయణ విడుదల చేశారు. కేరళ, తమిళనాడు, కలకత్తా, గోవా తదితర ప్రాంతాల విద్యార్థులు హాజరైనప్పటికీ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కపబరిచారన్నారు. విజేతలైన విద్యార్థులంతా ఈ నెల 17న రామచంద్రపురంలో నిర్వహించే రామానుజన్ గణిత ఉత్సవాలకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. ప్రథమ విజేతకు రూ.వెయ్యి, ద్వితీయ విజేతకు రూ.500 అందజేయనున్నట్టు తెలిపారు. విజేతల వివరాలు ఇలావున్నాయి. 4వ తరగతి విభాగంలో తూర్పు గోదావరి జిల్లా కాతేరుకు చెందిన తిరుమల స్కూల్ విద్యార్థి జి లలితా శ్రీనిధి ప్రథమ విజేతగా నిలిచారు. ద్వితీయ ర్యాంకులను చిత్తూరు జిల్లా కంఫర్ట్ ఇంగ్లీష్ హైస్కూల్ విద్యార్థులు పి అభినవరాజ్, పి పావని సాధించారు. 5వ తరగతి విభాగంలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ఆల్‌ఫోర్స్ హైస్కూల్ విద్యార్థి వి సజీత్‌రెడ్డి తొలి ర్యాంకును, గుడివాడ డాక్టర్ కెకెఆర్ గౌతమ స్కూల్ విద్యార్థి కెఎన్‌ఎస్ కృష్ణ సాధించారు. 6వ తరగతి విభాగంలో తూర్పు గోదావరి జిల్లా కాతేరు తిరుమల స్కూల్ విద్యార్థి ఎన్‌పి జశ్వంత్, హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన భాష్యం ఉన్నత పాఠశాల విద్యార్థి ఎం రోహిత్ ద్వితీయ స్థానాన్ని అందుకున్నారు. 7వ తరగతి విభాగంలో గుంటూరు జిల్లా గోరంట్ల భాష్యం ఐఐటి ఫౌండేషన్ విద్యార్థి కె వీర శివాజీ, కూకట్‌పల్లి భాష్యం హైస్కూల్ విద్యార్థి ఎన్ సింధు వరుస స్థానాలు సాధించారు. 8వ తరగతి విభాగంలో కూకట్‌పల్లి భాష్యం హైస్కూల్ విద్యార్థి జి రఘురాం, కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన డాక్టర్ కెకెఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థి డి శ్యామనాద్ వరుస స్థానాలు సాధించారు. 9వ తరగతి విభాగంలో తూర్పు గోదావరి జిల్లా కాతేరు తిరుమల స్కూల్ విద్యార్థులు పివి గౌతమ్, అదే పాఠశాలకు చెందిన వి సూర్యచరణ్ వరుస స్థానాలు సాధించారు. 10వ తరగతి విభాగంలో తూర్పు గోదావరి జిల్లా కాతేరుకు చెందిన తిరుమల స్కూల్ విద్యార్థి ఎం రోహిత్ ప్రథమ స్థానాన్ని సాధించగా ద్వితీయ స్థానాలు రెండింటిని అదే పాఠశాలకు చెందిన బివి వికాష్, ఎంఆర్ తేజశ్వని అందుకున్నారు. రెండు సెకండ్ ర్యాంకులను కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన డాక్టర్ కెకెఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థులు జితేంద్ర, మణికంఠ సాధించారు.