రాష్ట్రీయం

ఏపికి పెరిగిన పన్నుల రాబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర నిధులూ పెరిగాయి

హైదరాబాద్, మార్చి 11: ఆంధ్రప్రదేశ్‌లో సొంత వనరుల ద్వారా పన్ను, పనే్నతర ఆదాయం బాగానే పెరిగింది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల ఆదాయం గణనీయంగా వృద్ధి చెందింది. సామాజిక ఆర్థిక సర్వే- 2016 ఆసక్తికరమైన గణాంకాలను వెల్లడించింది. ఈ సర్వే వివరాలను విశే్లషిస్తే రాష్ట్రంలో సొంత వనరుల నుంచి పన్ను ఆదాయం 2014-15లో ఉన్న 29,857 కోట్ల నుంచి 2015-16లో 44,423కోట్లకు పెరిగింది. అమ్మకం పన్ను రూ.21672 కోట్ల నుంచి రూ.32,840 కోట్లకు, ఎక్సైజ్ ఆదాయం రూ.3642 కోట్ల నుంచి రూ.46800 కోట్లకు, మోటారు వాహనాల పన్ను రూ.1423 కోట్ల నుంచి రూ.1977 కోట్లకు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు రూ.2561 కోట్ల నుంచి రూ.3500 కోట్లకు, భూమి రెవెన్యూ రూ.28 కోట్ల నుంచి రూ.632 కోట్లకు, వృత్తిపన్ను రూ. 185 కోట్ల నుంచి రూ.302 కోట్లు, విద్యుత్ డ్యూటీ రూ.118 కోట్ల నుంచి రూ.190 కోట్లు, ఇతర పన్నులు రూ. 97 కోట్ల నుంచి రూ.127 కోట్లకు పెరిగాయి. రాష్ట్రంలో సొంత రెవెన్యూ పనే్నతర ఆదాయం కూడా గణనీయంగానే పెరగడం విశేషం. 2014-15తో పోలిస్తే అన్ని విభాగాల్లో 2015-16లో రెవెన్యూ పెరిగింది. రూ.3955 కోట్ల నుంచి రూ. 5341 కోట్లకు పెరిగింది. గనులు, ఖనిజ సంపద ఆదాయం రూ.811 కోట్ల నుంచి రూ.1359 కోట్లు, అడవులు రూ. 414 కోట్ల నుంచి రూ. 1072 కోట్లకు, వడ్డీ ద్వారా ఆదాయం రూ. 371 కోట్లు నుంచి రూ.554 కోట్లు, విద్యా రంగంలో రూ.1087 కోట్ల నుంచి రూ.1136 కోట్లు, వైద్యం, ఆరోగ్య రంగంలో రూ.72 కోట్ల నుంచి రూ.95 కోట్లు, ఇతర రంగాల్లో రూ.1200 కోట్ల నుంచి రూ.1525 కోట్లకు పెరిగింది.
గణనీయంగా పెరిగిన కేంద్రం నిధులు
కేంద్రం నుంచి రాష్ట్ర వాటాకు వచ్చే ఆదాయం, పన్నుల ఆదాయంలో కేటాయింపులు భారీగానే పెరిగాయి. కేంద్రం నుంచి గత ఏడాది మొత్తం రూ. 28,569 కోట్లు విడుదల కాగా, ఈ ఏడాది ఇంతవరకు రూ. 40,104 కోట్ల నిధులు వచ్చాయి. ఫైనాన్స్ కమిషన్ నుంచి 2014-15లో రూ.15,557 కోట్లు, 2015-16లో రూ.30,116 కోట్లు, పన్నుల వాటా రూ.11446 కోట్ల నుంచి రూ. 21,894 కోట్లకు, గ్రాంట్లు రూ. 4071 కోట్ల నుంచి రూ.8222 కోట్లకు, గ్రాంట్లు రూ. 11542 కోట్లు, ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల కింద రూ. 456 కోట్ల నుంచి రూ.1260 కోట్లకు, ప్రణాళికేతర గ్రాంట్లు రూ. 588 కోట్ల నుంచి రూ.1000 కోట్లకు పెరిగాయి.
అప్పుల భారాన్ని విశే్లషిస్తే ఇంతవరకు మొత్తం 1,70.115 కోట్లు ఉన్నట్లు తేలింది. గత ఏడాది 1,56,472 కోట్ల రుణాలు ఉండేవి. మొత్తం జిఎస్‌డిపిలో రుణ భారం గత ఏడాది 29.36 శాతం ఉండగా, ఈ ఏడాది 28.19 శాతానికి తగ్గింది. ఈ ఏడాది కేంద్రం నుంచి 14,210 కోట్లు, మార్కెట్ రుణాలు రూ.95,453 కోట్లు, చిన్న మొత్తాల పొదుపు కింద రూ.14,405 కోట్లు, పిఎఫ్ కింద 15,770 కోట్లు, ఇతర పద్దులో 30,277 కోట్లు రుణాలు ఉన్నాయి. గత ఏడాది వడ్డీల రూపంలో రూ.7903 కోట్లు, ఈ ఏడాది రూ.9478 కోట్లు చెల్లించినట్లు సామాజిక ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. గత ఏడాది ఆర్థిక లోటు 20,746 కోట్లు ఉండగా, ఈ ఏడాది రూ.17,005 కోట్లకు తగ్గింది.