ఆంధ్రప్రదేశ్‌

పోషకాహార లోప రహిత గ్రామాలే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 13: రాష్ట్రంలోని గ్రామాలను వంద శాతం మేర పోషకాహార లోప రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమం, సెర్ప్ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. పిల్లలకు ఆటపాటలతో చదువు నేర్పించడమే ప్రీ స్కూల్స్ లక్ష్యమని అన్నారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణతో కలిసి ఆమె మాట్లాడారు. మున్సిపల్ శాఖ సహకారంతో ప్రీ స్కూల్స్ ప్రారంభించిన నాటి నుండి అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపయిందన్నారు. పిల్లలకు తెలుగుతోపాటు ఇంగ్లీష్ కూడా నేర్పిస్తున్నామన్నారు. వెలుగు కార్యక్రమం ద్వారా తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యాలను ప్రతి అంగన్‌వాడీకి సమకూర్చామన్నారు. తమ ప్రభుత్వం వచ్చినప్పటినుండి సకాలంలో అంగన్‌వాడీ కార్యకర్తల బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తున్నామన్నారు. 8,9 నెలల గర్భిణులకు, 42 రోజుల లోపు ఉన్న బాలింతలకు ప్యాక్ చేసిన భోజనాన్ని ఇంటికే అందిస్తున్నామన్నారు. కోడిగుడ్లు, పాలు సరఫరాను మొబైల్ యాప్, బయొమెట్రిక్ విధానం ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. అంగన్‌వాడీలకు కోడిగుడ్లు వచ్చినప్పుడే ట్రేలను తూకం వేసి తక్కువ బరువు ఉన్న వాటిని వెనక్కి పంపిస్తున్నామన్నారు. కిషోరీ వికాసం కార్యక్రమం ద్వారా 11 నుండి 18 సంవత్సరాల ఆడపిల్లలకు వారి ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం శిక్షణ ఇస్తున్నామన్నారు. అంగన్‌వాడీలకు శిక్షణ ఇవ్వడం కోసం పద్మావతి మహిళా యూనివర్శిటీ సహాయంతో యశోద డిప్లొమా కోర్సును ప్రారంభించామన్నారు. మాతా, శిశు మరణాలను తగ్గించడమే యశోద డిప్లొమా కోర్సు ముఖ్య ఉద్దేశ్యమన్నారు. మొదటి విడతలో 1400 మంది అంగన్‌వాడీలో ఈ కోర్సులో శిక్షణ పొందుతున్నారన్నారు.
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ స్ర్తి శిశు సంక్షేమం, మున్సిపల్ శాఖల సమన్వయంతో రెండు, మూడు అంగన్‌వాడీ స్కూళ్లను కలిపి ప్రీ స్కూల్స్‌గా మార్చామన్నారు. 110 మున్సిపాలిటీలలో 3148 అంగన్ వాడీ సెంటర్లను విలీనం చేసి ప్రీ స్కూల్స్‌గా మార్చామన్నారు. కన్సల్‌టెంట్ల ద్వారా అంగన్ వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చి, పిల్లలకు ఆటపాటలతో చదువు నేర్పిస్తున్నామన్నారు. ప్రీ-స్కూల్స్ పెట్టాక ప్రైవేటు స్కూల్స్ నుండి అంగన్‌వాడీలకు పిల్లలు వస్తున్నారన్నారు. కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా అంగన్‌వాడీల్లో చదువు నేర్పిస్తామని తెలిపారు. రాబోయే రెండు సంవత్సరాల్లో ఎడ్యుకేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ను నెం.1గా నిలుపుతామన్నారు. దీనికి ముందు రాష్టస్థ్రాయి ప్రాజెక్టు డైరెక్టర్లు, మున్సిపల్ శాఖ కన్సల్‌టెంట్స్‌తో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా శాఖ కార్యక్రమాలపై వివరంగా చర్చించారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న పోషకాహారంపై అడిగి తెలుసుకున్నారు. జిల్లాలలో ఏమైనా సమస్యలుంటే అధికారులు తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు. అన్న అమృతహస్తం పథకం ప్రజల్లో 85 శాతం సంతృప్తికరంగా ఉందన్నారు. దీనిని వందశాతానికి తీసుకురావాలని అధికారులకు తెలియజేశారు. పిల్లలు, గర్భిణులకు ఇచ్చే పాలు సరైన సమయానికి సరఫరా చెయ్యాలని లేకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని తెలియజేశారు. 200 మి.లీ ప్యాకెట్లు ఇవ్వాలని ఏపీ డైరీ ప్రతినిధులను ఆదేశించారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు వారి పంచాయితీల నుండి అదనపు ఆహారాన్ని అందిస్తున్నారని అధికారులు తెలుపగా మంత్రి వారికి అభినందనలు తెలిపారు
అన్ని గ్రామాల్లో ఈ విధంగా సర్పంచ్‌లు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్ర్తిశిశు సంక్షేమ శాఖ కమిషనర్ అరుణకుమార్, సెక్రటరీ కె.సునీత, మున్సిపల్ శాఖ డైరెక్టర్ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.