ఆంధ్రప్రదేశ్‌

అగ్రగామి రాజధానిగా అమరావతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 14: ప్రపంచంలో ప్రసిద్ధిచెందిన రాజధాని నగరాల జాబితాలో అమరావతి అగ్రగామి రాజధాని నగరంగా ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. గురువారం విజయవాడలోని ఒక హోటల్‌లో అమరావతి రాజధాని నిర్మాణంపై సీఆర్‌డీఏ రెండురోజుల పాటు నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌ను మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నగరాల్లో అగ్రగామిగా అమరావతిని నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ప్రసిద్ధిచెందిన ఆర్కిటెక్ట్స్ నార్మన్ పోస్టర్ సంస్థతో రాజధాని నగరంలో నిర్మించే ప్రభుత్వ భవనాలు, హైకోర్టు, అసెంబ్లీ భవనాల సముదాయాలకు సంబంధించిన ఆకృతులను ఫైనల్ చేయడంలో చివరి దశకు చేరుకున్నామన్నారు. సచివాలయం డిజైన్లపై ప్రజల అభిప్రాయాల కోసం పబ్లిక్ డొమైన్‌లో ఉంచామన్నారు.
దీనికి సంబంధించి ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నామని, ఇప్పటివరకు వెయ్యి మంది వజ్రాకృతి డిజైన్‌కు మద్దతు ఇచ్చారని, 4వేల మంది టవర్ ఆకృతికి మద్దతు ఇచ్చారన్నారు. డిజైన్లపై ప్రజల అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి దృష్టిలో ఉంచి డిజైన్‌ను ఖరారు చేస్తామన్నారు.