ఆంధ్రప్రదేశ్‌

గుప్తనిధుల కోసం తవ్వకాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుగ్గలి, డిసెంబర్ 14: పోలీసు బందోబస్తు మధ్య రాయల కాలం నాటి కోటలో గుప్తనిధుల కోసం అధికారులు తవ్వకాలు జరపడం సంచలనం రేపింది. తవ్వకాలకు పురావస్తుశాఖ, ప్రభుత్వం అనుమతి ఇచ్చిఉంటే చూపాలంచాలని రాజకీయ నాయకులు, ప్రజలు అడ్డుకోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. తవ్వకాలకు ప్రజలు సహకరించాలని ఆర్డీఓ విజ్ఞప్తి చేయడం గమనార్హం. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాయల కాలం నాటి చెన్నంపల్లి కోటలో గుప్తనిధులు ఉన్నాయన్న వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. కోటలో పెద్దమొత్తంలో బంగారం నిల్వలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో గురువారం పోలీసు బందోబస్తు రెవెన్యూ అధికారులు కోటలో తవ్వకాలు జరిపేందుకు ముందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న పలువురు నాయకులు, ప్రజలు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించాల్సిన అధికారులు నిధుల పేర తవ్వకాలు జరపడం విచారకరమని అన్నారు. పురావస్తుశాఖ, ప్రభుత్వం అనుమతి పత్రాలు బహిర్గతం చేయాలని పట్టుబట్డారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా నిధి తవ్వకాలకు గ్రామస్థులు పూర్తి సహకారం అందించాలని ఆదోని ఆర్డీఓ ఓబులేసు కోరారు. గ్రామ సర్పంచ్ రంగమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ప్రసంగించిన ఆర్డీఓ గ్రామస్థులంతా సహకరిస్తే ప్రభుత్వం ఆధ్వర్యంలో తవ్వకాలు జరుపుతామన్నారు.