ఆంధ్రప్రదేశ్‌

విశాఖ కోర్టుకు ప్రత్యేక పీపీని నియమించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: విశాఖ జిల్లా వాకపల్లి గ్యాంగ్ రేప్ కేసులో బాధితులకు న్యాయం జరిగే విధంగా విశాఖ ప్రత్యేక కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలని కోరుతూ వాకపల్లి బాధితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గిరిజన తెగకు చెందిన 9 మంది మహిళా బాధితులు హైకోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించేందుకు అధికారం ఉందన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 30వ తేదీన పిపిని నియమించాలని కలెక్టర్‌ను కోరామన్నారు. కాని ఇంతవరకు కలెక్టర్ నుంచి స్పందన లేదన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ డాక్టర్ పి త్రినాథరావుకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును బాధితులు కోరారు. 2007 ఆగస్టు 20వ తేదీన విశాఖ జిల్లా వాకపల్లిలో గిరిజన మహిళలను 21 మంది గ్రేహౌండ్స్‌బలగాల కానిస్టేబుళ్లు అత్యాచారం చేసినట్లు అభియోగాలపై కేసునమోదై ది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను ప్రత్యేక కోర్టు ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేసింది.