ఆంధ్రప్రదేశ్‌

ఇక ఈ-వీసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 15: పర్యాటకశాఖ చేసిన ప్రత్యేక కృషి ఫలితంగా విశాఖ నగరానికి ఈ-వీసా సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. ఈ మేరకు కేంద్ర అంతరంగిక శాఖ సమాచారం అందించిందని శుక్రవారం వెల్లడించారు. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే పర్యాటకులకు ఉపయోగకరమని, రాష్ట్రంలో ఈ తరహా సౌకర్యం పొందిన తొలి విమానాశ్రయం విశాఖపట్నం మాత్రమేనన్నారు. ఈ-వీసా విధానం వల్ల అత్యంత సులభంగా పర్యాటకులు వీసాను పొందగలుగుతారన్నారు. ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకుని, అధీకృత ఆమోదంతో పర్యాటకులు పొందిన ఈ మెయిల్‌ను విశాఖ విమానాశ్రయంలో చూపటం ద్వారా స్టాంపింగ్ వేయించుకోగలుగుతారని మీనా వివరించారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే పర్యాటకులు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలలో ఈ-వీసా పొందుతున్నారని, తాజా సౌకర్యం వల్ల వారికి మరింత సమయం ఆదా అవుతుందని, నేరుగా అంతర్జాతీయ విమానాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు రాగలుగుతారన్నారు. ఇప్పటికే కొన్ని దేశాల విషయంలో ‘వీసా ఆన్ అరైవల్’ విధానం అమలవుతుందని వివరించారు. ఈ-వీసా ద్వారా అనుమతి పొంది దేశంలోకి ప్రవేశించిన పర్యాటకులు రెండు నెలల పాటు ఉండవచ్చని, వీరు తమ మెడికల్ టూరిజం అవసరాలను కూడా తీర్చుకోగలుగుతారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యాటకరంగ అభివృద్ధికి చేస్తున్న నిరంతర కృషి ఫలితంగానే ఈ తరహా సౌలభ్యాలను పొందగలుగుతున్నామన్నారు. భారతదేశ పర్యాటక రంగానికి విశాఖ ముఖద్వారంగా ఉండాలన్న ధ్యేయంతో, విభిన్న కార్యక్రమాలను చేపడుతూ ముందుకు వెళుతున్నామని వివరించారు. ఈ-వీసా విధానంలో బిజినెస్ వీసా సైతం పొందగలుగుతారని ఇది రాష్ట్రంలో పెట్టుబడులకు ఉపకరిస్తుందని ముఖేష్‌కుమార్ మీనా స్పష్టం చేశారు.
బాబు కృషితోనే సాధ్యమైంది: అఖిలప్రియ
విదేశీయులు ఎవరైనా ఇప్పుడు నేరుగా ఏపీకి వీసా లేకుండానే రావచ్చని పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో టూరిస్ట్ వీసా ఆన్ ఎరైవల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేపటి నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో టూరిస్ట్ వీసా ఆన్ ఎరైవల్ ప్రారంభమవుతోంది.